YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో ఫస్ట్ టెస్టింగ్ కిట్

ఏపీలో ఫస్ట్ టెస్టింగ్ కిట్

ఏపీలో ఫస్ట్ టెస్టింగ్ కిట్
విజయవాడ, ఏప్రిల్ 8
భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే కరోనా టెస్టింగ్‌ కిట్లు, వెంటిలేటర్లు తయారు చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం 200 మందికి పరీక్షలు నిర్వహించేందుకే చాలా ఇబ్బంది పడుతున్నామని, అయితే ఈ నెలాఖరులోపు రాష్ట్రంలో 3 వేల నుంచి 4 వేల మంది కరోనా పరీక్షలు చేసేలా కిట్లు తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో మంత్రి గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా టెస్టింగ్‌ కిట్లను ప్రారంభించారని వెల్లడించారు.త్వరలోనే ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా కిట్లు సరఫరా అవుతాయని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. టీబీ మెషీన్లకు అమర్చుకునేలా కిట్లను తయారు చేస్తున్నామని.. దీని వల్ల త్వరగా టెస్టింగ్‌ కిట్లను అమర్చుకోవచ్చని వెల్లడించారు. అలాగే మొట్టమొదటి ఇండియన్‌ మేడ్‌ వెంటిలేటర్లను కూడా విశాఖలో తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు.గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెడ్‌టెక్‌ జోన్‌కు నిధులిచ్చి సీఎం అందుబాటులోకి తెచ్చారని మంత్రి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముందు చూపు వల్లే ఈ రోజు కిట్లు తయారు చేయగలిగామని, సీఎం జగన్‌ మాటల మనిషి కాదని.. చేతల మనిషి అని ప్రశంసించారు. అలాగే రాష్ట్రంలో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. కాగా, కిట్లు పనిచేసే తీరును మంత్రి గౌతమ్ రెడ్డికి రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఇండస్ట్రీస్, కామర్స్) రజత్ భార్గవ వివరించారు.

Related Posts