YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సత్తుపల్లిలో కరోనా కలకలం

సత్తుపల్లిలో కరోనా కలకలం

సత్తుపల్లిలో కరోనా కలకలం
గుంటూరు, ఏప్రిల్ 8 
కరోనా నేపథ్యంలో ఏపీలోని గుంటూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 40కి పైగా కేసులతో రాష్ట్రంలోనే టాప్ 3లో ఉంది. తాజాగా జిల్లాలోని సత్తెనపల్లిలో విదేశీయులు ఉన్నారన్న సమాచారం కలకలం రేపింది. టూరిస్ట్‌ వీసాపై వచ్చిన పది మంది విదేశీయులు స్థానికంగా ఉన్న ఓ మసీదులో ఉన్నారన్న సమాచారంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. వారంతా ఢిల్లీలో ప్రార్థనలకు హాజరై.. అక్కడి నుంచి పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.టూరిస్ట్ వీసాపై ఇండియాకి వచ్చిన పది మంది విదేశీయులు సత్తెనపల్లిలో ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. విదేశీయులు బస చేస్తున్న ప్రదేశానికి వెళ్లి వివరాలు సేకరించారు. వారంతా కజకిస్థాన్, కిర్గిస్థాన్ నుంచి వచ్చిన వారిగా తేలింది. విదేశీయులు టూరిస్ట్ వీసాపై ఢిల్లీకి వచ్చి అక్కడ ప్రార్థనల్లో పాల్గొని.. అక్కడి నుంచి మత ప్రచారం నిర్వహిస్తూ జిల్లాలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.గుంటూరు వచ్చి.. అక్కడి నుంచి సత్తెనపల్లి చేరుకున్నట్లు సమాచారం. అయితే టూరిస్ట్ వీసా‌పై వచ్చి నిబంధనలకు విరుద్ధంగా మత ప్రచారంలో పాల్గొన్నందున వారిపై కేసులు నమోదు చేసినట్లు సత్తెనపల్లి పట్టణ సీఐ విజయచంద్ర తెలిపారు. మొత్తం పది మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే వారికి గుట్టుచప్పుడు కాకుండా ఆశ్రయం కల్పించిన వారిపైనా చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.ఇప్పటి వరకూ సత్తెనపల్లి ప్రాంతంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి పది మంది సత్తెనపల్లి వచ్చారని తెలియడంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఆ పది మందితో సహా వారికి ఆశ్రయం కల్పించిన వారికి కూడా కరోనా టెస్టులు నిర్వహించినట్లు తెలిసింది. ఆ టెస్టుల్లో వారికి కరోనా నెగెటివ్ వచ్చినట్లు సీఐ తెలిపారు. దీంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Related Posts