YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అగ్నిగుండంగా మారిన విశాఖ

అగ్నిగుండంగా మారిన విశాఖ

అగ్నిగుండంగా మారిన విశాఖ
విశాఖపట్టణం, ఏప్రిల్ 9
విశాఖ నగరం...అగ్నిగుండం...ఎండలు మండిపోతున్నాయి....సూరీడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు...ఎండల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుంది...జనం అల్లాడిపోతున్నారు...ఉదయం నుంచే ఎండ తీవ్రత ఉండగా, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు...గురువారం విశాఖ విమానాశ్రయంలో 37డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, ఇవి సాదారణం కంటే కూడా మూడు డిగ్రీల అధికమని విశాఖపట్నం వాతావరణ కేంద్రంపేర్కొంది. అదే గత ఏడాది ఇదే సమయానికి కాస్తంత తక్కువుగా ఉండే పరిస్థితులు కనిపించగా ఈసారి మార్చి రెండవ వారంలోనే తీవ్రత పెరిగింది. ఇవే పరిస్థితులు కొనసాగవచ్చని, లేదంటే మధ్యలో కాస్తంత ఉపశమనం కలగవచ్చని ఈ కేంద్రం తెలియజేసింది. మండుతున్న ఎండలు రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది. ఆసుపత్రులకు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. వృద్ధులు, మహిళలు తిరిగేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు కరోనా కూడా కలిసి రావడంతో రోగుల పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. ఆసుపత్రులకు తరలివెళ్ళేవారు బాధలు వర్ణనాతీతం. నగరంలోని ప్రధాన కూడళ్ళు, జంక్షన్ల వద్ద నిర్మాన్యుషంగా మారుతోంది. నిత్యం రద్దీగా ఉండే అల్లిపురం, జ్ఞానాపురం, పూర్ణామార్కెట్‌లతోపాటు నగరంలోని అక్కయపాలెం, మర్రిపాలెం, కంచరపాలెంమెట్టు, ఎంవీపీ కాలనీ, మధురవాడ తదితరచోట్ల రైతుబజార్లు వినియోగదారుల తాకిడి తగ్గడంతో బోసిపోతున్నాయి. కూరగాయలు కొనుగోలు చేసేందుకు కాస్తంత ఆసక్తి చూపే వినియోగదారులు ఎండకు భయపడి ఉదయం సమయంలోనే వెళ్తున్నారు..నగర శివారుప్రాంతాల్లో ఇప్పటి నుంచే నీటి కొరత ఏర్పడింది. మునిసిపల్ కార్పొరేషన్ నీటి సరఫరా తక్కువ సమయంలోనే వస్తుండగా, భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోతున్నాయి. ఫలితంగా గొట్టపుబావులు మొరాయిస్తున్నాయి. దీనివల్ల తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. గుక్కెడు నీటి కోసం మహిళలు దూరప్రాంతాలకు తరలివెళ్ళాల్సి వస్తోంది. నగరంలోని కొన్ని మురికివాడలను శివారు ప్రాంతాలకు తరలించడంతోనే నీటి ఎద్దడి ఉందంటూ అనేక ప్రాంతావాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రతి ఏడాది వేసవి సీజన్‌లోనైనా వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా జరిగేది. అటువంటిది ఈసారి ఇప్పటికీ ఇవేమీ ప్రత్యక్షంకావడంలేదు. ఎక్కువుగా ఎండాడ, కారుషెడ్ ఏరియా, మదురవాడ వాంబేకాలనీ, పీఎం పాలెం ఆర్‌హెచ్ కాలనీ, బక్కన్నపాలెం ఎన్‌టీఆర్ కాలనీ, అంబేద్కర్‌నగర్, కొమ్మాది, బోయిపాలెం, మధురవాడ నగరపాలెం, గణేశ్‌నగర్ తదితర ప్రాంతాల్లో స్థానికులు నీటి కోసం అనేక అవస్థలు పడాల్సి వస్తోంది.

Related Posts