YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పారిశుద్ధ్య కార్మికులకు 1000 రూపాయలు అందజేసిన ఎమ్మెల్యే శ్రీదేవి

పారిశుద్ధ్య కార్మికులకు 1000 రూపాయలు అందజేసిన ఎమ్మెల్యే శ్రీదేవి

పారిశుద్ధ్య కార్మికులకు 1000 రూపాయలు అందజేసిన ఎమ్మెల్యే శ్రీదేవి
మద్దికేర ఏప్రిల్ 10
పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని గల మద్దికేర మండలంలో పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులకు,గ్రామ వాలంటీర్లకు మరియు వైద్య సిబ్బంది కు పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి శానిటైజర్ కిట్లను మరియు కూరగాయలను పంపిణీ చేశారు.అదేవిధంగా మద్దికేర లోని గల 120 మంది పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు చొప్పున 1,20,000 రూపాయలను అందజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా వైద్య సిబ్బంది,పారిశుద్ధ్య కార్మికులు మరియు గ్రామ వాలంటీర్లు తమ విధులను చక్కగా నిర్వర్తిస్తూన్నారని ఆమె తెలియజేశారు. గ్రామాలలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్య సిబ్బంది,పారిశుద్ధ్య కార్మికులు మరియు గ్రామ వాలంటీర్లు తమ వంతుగా ప్రజల క్షేమం కొరకు తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆమె తెలియజేశారు.అందువలన వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కరోనా నివారణ శానిటైజర్ కిట్లను,కూరగాయలను మరియు పారిశుద్ధ్య కార్మికులకు 1000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు ఆమె తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పారా విశ్వనాధ్,మురళీధర్ రెడ్డి,వెంకటేశ్వర రెడ్డి, మల్లికార్జున యాదవ్ మరియు వైసీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts