YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

కేంద్రం.. వినియోగదారుల వ్యతిరేకి

కేంద్రం.. వినియోగదారుల వ్యతిరేకి

కేంద్ర ప్రభుత్వంపై మండిపడిన మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం

కేంద్ర ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్రం వ్యర్థ విధానాలను అమలు చేస్తోందని, కేంద్రం ‘వినియోగదారుల వ్యతిరేకి’ అని ఆయన ఆరోపించారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2018-19 నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పలు ట్వీట్లలో ఆయన ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. అప్పులు, పెట్టుబడులు, ఆర్థిక లోటు, ఇంధన ధరలు, జీఎస్టీ వంటి వాటిని ఎత్తి చూపారు. ‘‘30 వేల కోట్ల అప్పులు తగ్గించామని కేంద్రం చెబుతోంది. అయితే, హెచ్‌పీసీఎల్ షేర్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వానికి నగదు చెల్లింపుల కోసం ఓఎన్జీసీ రూ.30 వేల కోట్లు అప్పు చేయాలి. కాబట్టి, అందులో పెద్ద తేడా ఏం లేదు. రూ.30 వేల కోట్ల ఆర్థిక లోటు ఉందని మార్కెట్ నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు’’ అని ట్వీట్ చేశారు. ఇక, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయని, వినియోగదారులను ప్రభుత్వం అణచేస్తోందని, కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ‘వినియోగదారుల వ్యతిరేకి’ అని ఆయన అన్నారు. పెట్రోల్, డీజిల్‌ ద్వారా ప్రజల నుంచి భారీగా వసూలు చేస్తున్న పన్నులను అనవసర పనులకు కేంద్రం ఖర్చు చేస్తోందని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు. 

Related Posts