YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

నాటు సారా ధ్వంసం

నాటు సారా ధ్వంసం

నాటు సారా ధ్వంసం
 రెండువేల బెల్లం ఊట ధ్వంసం  ఎక్సైజ్ సిఐ నాగ సునీత రాణి
నాటు స్థావరాలపై ఎక్సైజ్  దాడులు
నందికొట్కూర్ మే 18,
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మద్యపాన నిషేధం పై రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ మరియు ఏ ఎస్ పి వారి సూచనల మేరకు పోలీస్ సిబ్బంది మరియు ఎక్సైజ్ వారి ఉమ్మడి ఆధ్వర్యంలో  ఎక్సైజ్ సీఐ నాగ సునీత రాణి ,పట్టణ సీఐ నాగరాజారావు ,ఎక్సైజ్ ,పట్టణ ఎస్.ఐలు  శ్రీ లక్ష్మీ ,హరికృష్ణ ,చంద్రబాబు, వెంకట్ రెడ్డి ల  ఆధ్వర్యంలో అధికారులు నాటుసారా స్థావరాలపై సోమవారం దాడులు నిర్వహించారు.గత నెల 22 నుంచి జనతా కర్ఫ్యూ విధించి నాటినుంచి నేటి వరకు ఐదు సార్లు దాడులు నిర్వహించామని సిఐ తెలిపారు .సారా తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .ఈ దాడులలో రెండు వేల లీటర్ల బెల్లం ఊట మరియు 30 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసినట్లు పట్టణ సీఐ నాగరాజు తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటు సారా తయారు చేసేవారు మీరు ఈ వృత్తి వదిలి వేరే వృత్తి మార్గం ఎంచుకోవాలని ఆయన సూచించారు .లేని తరుణం లో ఇలాంటి దాడులు ఎన్నో జరుగుతాయని హెచ్చరించారు . ఎక్సైజ్ శాఖ అధికారులు నాటు సారాయి తయారు చేసిన వారిపై ఉక్కుపాదం మోపారు .ఏది ఏమైనా ఇకనుంచి ఉమ్మడి పోలీసుల ఆధ్వర్యంలో సారా తయారు చేస్తున్న వారిపై దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేగాక 30 మందు బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో పోలీస్ సిబ్బంది ,ఎక్సైజ్ సిబ్బంది,మహిళా సిబ్బంది ,హోంగార్డులు, కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts