YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

దారుణహత్య యూపీలో ఎస్పీ నేత, అతని కుమారుడి

దారుణహత్య యూపీలో ఎస్పీ నేత, అతని కుమారుడి

దారుణహత్య యూపీలో ఎస్పీ నేత, అతని కుమారుడి
లక్నో మే 19
: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ నాయకుడు, అతని కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. సంభాల్‌ జిల్లాలోని బహ్‌జోయ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనుల విషయంలో మొదలైన గొడవ హత్యకు దారితీసింది. సంభాల్‌ జిల్లా సరోయ్‌ గ్రామానికి చెందిన చోటేలాల్‌ దివాకర్‌ 2017లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయాడు. ఆ తర్వాత సరోయ్‌ గ్రామ ప్రధాన్‌గా ఎన్నికయ్యాడు. అయితే ఇటీవల ఉపాధీ హామీ పథకం పనుల విషయమై చోటేలాల్‌కు, గ్రామ మాజీ ప్రధాన్‌కు మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులు చోటేలాల్‌ను, అతని కుమారుడిని తుపాకీతో కాల్చిచంపారు.

Related Posts