YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

డా.సుధాకర్ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం

డా.సుధాకర్ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం

డా.సుధాకర్ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం
అమరావతి మే 20
విశాఖలో వైద్యుడు సుధాకర్ అరెస్టుకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సెషన్స్ జడ్జి నేరుగా సుధాకర్ ఉన్న ఆసుపత్రికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేయాలని ఆదేశించింది. గురువారం సాయంత్రంలోగా వాంగ్మూలాన్ని హైకోర్టుకు సమర్పించాలని సూచించింది. అలాగే, ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్, వీడియో క్లిప్పింగ్లను.. పిటిషనర్ తరపు న్యాయవాదులకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. వైద్య సిబ్బందికి మాస్కులు లేవంటూ గతంలో వ్యాఖ్యానించి సస్పెండైన మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్ను.. శనివారం విశాఖపట్నంలో జాతీయ రహదారిపై గొడవ చేస్తున్నారని పోలీసులు అరెస్టు చేయడం కలకలం సృష్టించింది. సుధాకర్ గొడవ చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెళ్లారు. పోలీసులను, ముఖ్యమంత్రిని కూడా దుర్భాషలాడటంతో అదుపులోకి తీసుకున్నారు. విధులకు ఆటంకం కలిగించినందుకు వైద్యుడిపై 353, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన్ను కొట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్ మధుబాబును సస్పెండ్  చేశారు. సుధాకర్ మానసిక పరిస్థితి బాగోలేదని కేజీహెచ్ వైద్యులు చెప్పడంతో.. పోలీసులు ఆయనను ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు. గతంలో మాస్కులు లేవని సుధాకర్ ఆరోపించడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. ఆయన్ను సస్పెండ్ చేసింది. డాక్టర్ సుధాకర్ అరెస్టుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఉన్నత న్యాయస్థానం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.

Related Posts