YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

యదేఛ్చగా కలుషిత మాంసం విక్రయాలు

యదేఛ్చగా కలుషిత మాంసం విక్రయాలు

యదేఛ్చగా కలుషిత మాంసం విక్రయాలు
ఖమ్మం, మే 21,
మాంసం విక్రయాలపై పర్యవేక్షణ లోపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు కొనసాగుతున్నాయి. ప్రజల బలహీనతలను దుకాణాల వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పశువైద్యులు, మున్సిపాలిటీల కనుసన్నల్లో కొనసాగాల్సిన మాంసం విక్రయాలను పట్టించుకునే దిక్కే కరవైంది. మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా మాంసం మార్కెట్లు ఉండాలన్న నిబంధన అమలుకు నోచుకోవడంలేదు. జిల్లా పరిధిలో నిత్యం కలుషిత మాంసం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. వ్యాపారులు ఇష్టారాజ్యంగా గొర్రెలు, మేకలు, పశువులను వధిస్తున్నారు. పట్టణాల్లో మాంసం విక్రయాలకు ఓ పద్ధతి లేకపోవడంతో ఎవరికి వారుగా దుకాణాలు తెరిచి మాంసం విక్రయిస్తున్నారు. పలు వీధుల్లో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన సంబంధిత విభాగాల అధికారులు కొన్నేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రజలు కలుషిత మాంసం భుజిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. కొన్నేళ్లుగా అధునిక వధశాలను నిర్మిస్తామన్నా అధికారుల హామీ నెరవేడటం లేదు. దీంతో గ్రామాలతో పాటు, వాడవాడలా మాంసం దుకాణాలు వెలుస్తున్నాయి. జిల్లా పరిధిలోని అత్యధిక మున్సిపాలిటీల్లో నైజాం హయాంలో నిర్మించిన వధశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరి కొన్ని అన్యాక్రాంతం అయ్యాయి. దీంతో ఈ సాకు చూపి వ్యాపారులు ఇళ్ల వద్దే మేకలు, గొర్రెలు, ఆవులను వధించి ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు.  ప్రతి రోజు 520 వరకు, ఆదివారం సుమారు 2200 గొర్రెలు, మేకలను వధించి మాంసం విక్రయిస్తున్నట్లు అంచనా. జిల్లా పరిధిలో సుమారు ఆరు వేల కోళ్లు, ఆదివారం ఎనిమిది వేల కోళ్లు చికెన్‌ సెంటర్‌లలో విక్రయిస్తున్నట్లు అంచనా. అన్ని మున్సిపాలిటీల్లో మటన్‌, చికెన్‌, బీఫ్‌, ఫిష్‌ మార్కెట్లు ఉండాలన్న నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడంలేదు. భువనగిరి పట్టణంలో కొనసాగుతున్న మాంసం విక్రయాలను ఇటీవల జాతీయ మాంసం నాణ్యత ప్రమాణాల సంస్థ నిపుణులు పరిశీలించి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తమ నివేదికల్లో పేర్కొన్నారు. మాంసం మార్కెట్లపై పర్యవేక్షణ, నియంత్రణ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తేల్చారు. చనిపోయిన మేకలు, గొర్రెలను సైతం ఇళ్ల వద్దనే ప్రాసెస్‌ చేసి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అమ్ముడుపోగా మిగిలిన మాంసాన్ని నిల్వచేసి విక్రయిస్తున్నట్లు సమాచారం. నిల్వచేసిన మాంసంలో బ్యాక్టీరియా వృద్ధి చెంది, మాంసం కండరాలు కుళ్లిపోయి ఆహారం కలుషితమయ్యే అవకాశాలు ఉన్నాయి. పశువైద్యుడి సమక్షంలోనే ఆరోగ్యమైన మేకలు, గొర్రెలు, ఆవులను కోయాల్సి ఉండగా అలా జరగడంలేదు. కోసిన ప్రతి భాగాన్ని పశువైద్యుడు పరిశీలించి ఇందులో భుజించడానికి వీలులేని భాగాలను తొలగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎక్కడా అమలుకు నోచుకోకపోవడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొన్నాయి.

Related Posts