YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఆరో తరగతి బాలుడు న్యూడ్ పోటోస్ తో ఆంటీ

ఆరో తరగతి బాలుడు న్యూడ్ పోటోస్ తో ఆంటీ

ఆరో తరగతి బాలుడు న్యూడ్ పోటోస్ తో ఆంటీ
ఘజియాబాద్, మే 22,
స్మార్ట్‌ఫోన్లు, పోర్నోగ్రఫీ.. చిన్నారులపై విషప్రభావం చూపుతున్నాయి. టీనేజ్‌లోకి అడుగుపెడుతూనే సెక్స్ అనుభూతి పొందాలని భావిస్తున్న కొందరు దారుణాలకు తెగబడుతున్నారు. తనతో సెక్స్‌చాట్ చేయాలని.. లేకుంటే మార్ఫింగ్ చేసిన యువతి నగ్న ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ ఓ బాలుడు బెదిరింపులకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్‌లో జరిగింది.యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి సెక్స్‌చాట్ చేయాలని, లేకుంటే ఆ ఫొటోలు బయటపెడతానంటూ యువతిని ఆరో తరగతి బాలుడు బెదిరించిన షాకింగ్ సంఘటన కవి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కవి నగర్ ఏరియాకి చెందిన యువతి(21) డిగ్రీ పూర్తి చేసి సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవుతోంది. అదే ప్రాంతానికి చెందిన బాలుడు(12) ఆరో తరగతి చదువుతున్నాడు. ఆ ఇద్దరూ ఓ లోకల్ స్కూల్ వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నారు.గ్రూప్‌లో సదరు యువతి ఫోన్ నంబర్ తెలుసుకున్న బాలుడు ఆమెతో ప్రైవేట్‌గా చాట్ చేయడం ప్రారంభించాడు. ఆమెతో సాన్నిహిత్యం పెంచుకునేందుకు మొదట్లో సబ్జెక్ట్‌ గురించి ఎక్కువగా మాట్లాడేవాడు. అనంతరం ఆమె సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఫొటోలు డౌన్‌లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేశాడు. అలా మార్ఫింగ్ చేసిన యువతి న్యూడ్ ఫొటోలను ఆమె సెల్‌ఫోన్‌కి పంపించడంతో యువతి షాక్‌కి గురైంది.అనంతరం అతను తనతో సెక్స్ చాట్ చేయాలంటూ మెసేజ్‌లు పంపాడు. లేకుంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. తనతో సెక్స్‌చాట్ చేయాలని, తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో భయపడిపోయిన యువతి ఫోన్ స్విచాఫ్ చేసేసి పక్కన పడేసింది. యువతికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచాఫ్ అని వస్తుండడంతో ఆమె స్నేహితులు పేరెంట్స్‌కి ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.బాలుడి దారుణాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో బాధితురాలితో కలసి పోలీసులను ఆశ్రయించారు. యువకుడు పంపిన సుమారు 18 మార్ఫింగ్ చేసిన అసభ్యకర ఫొటోలను యువతి పోలీసులకు అందజేసింది. అలాగే అతను పంపిన అసభ్యకర మెసేజ్‌ను చూపించి అతనిపై ఫిర్యాదు చేసింది. అయితే ఆరో తరగతి బాలుడు అవన్నీ ఎలా చేస్తాడని.. ఆమె అబద్ధం చెబుతోందంటూ నిందితుడి తల్లిదండ్రులు వాదిస్తున్నారు. అదీ కాకుండా బాలుడి ఫోన్‌ని ఎవరో హ్యాక్ చేశారని.. వాళ్లే ఇదంతా చేసి ఉంటారని కొత్త అనుమానాలు లేవనెత్తారు. దీంతో పోలీసులు ఐపీ అడ్రస్ కనుక్కునేందుకు యత్నిస్తున్నారు. సైబర్ టీమ్ పోలీసులు టెక్నికల్ అంశాలపై దృష్టి పెట్టారు

Related Posts