YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

ధర్మబద్ధంగా ఉంటే?

ధర్మబద్ధంగా ఉంటే?

ధర్మబద్ధంగా ఉంటే?
 చెప్పాలంటే అధర్మముతో కూడిన పనులు చేసే వారి కోరికలలో, రాగము(సంగము, Attachment) తో కూడిన కోరికలు ఉన్న వారిలో నేను ఉండను అని భావము.
 బలవంతుడు అని ఎప్పుడు అంటాము.. వాడికి బాగా బలం ఉంటే అంటాము. ఆ బలం నేనే అంటున్నాడు పరమాత్మ. బలం అనేది ఒకటే. మానవునిలో ఉన్న శక్తి. ఆ బలం మంచి పనులకు ఉపయోగపడితే అది ధార్మికమైన బలం. ఆ బలాన్నే అసాంఘిక కార్యక్రమాలకు, ధర్మవిరుద్ధమైన కార్యాలకు వినియోగిస్తే అది రాక్షస బలం అంటారు.
రాముడు బలవంతుడు...
రావణుడు కూడా బలవంతుడే...
రాముడు తన బలాన్ని ధర్మరక్షణకు, దుష్టశిక్షణకు వినియోగించాడు. రావణుడు తన బలాన్ని రాక్షస ప్రవృత్తులకు వినియోగించాడు.
రాముని బలంలో దైవత్వం ఉంది. రావణుని బలంలో దైవత్వం లోపించింది. అందుకే రాముడి బలం ముందు రావణుని బలం నిలువలేకపోయింది.
 కాబట్టి, మనలో ఉన్న బలం ధర్మబద్ధంగా ఉండాలి. పరోపకారానికి వినియోగపడాలి. ధర్మవిరుద్ధమైన పనులు చేయడానికి, తన స్వార్ధపూరితమైన కోరికలు తీర్చుకోడానికి ఉపయోగించబడకూడదు. స్థూలంగా చెప్పాలంటే భగవత్స్వరూపమైన బలాన్ని దుర్వినియోగం చేయకూడదు..
 అలాగే కోరికలు కూడా ధర్మబద్ధంగానే ఉండాలి. ఇతరులకు హాని కలిగించేవిగా ఉండకూడదు. మానవునికి ఉన్న బలం, తనలో చెలరేగే పనికిమాలిన, ఇతరులకు హాని కలిగించే కోరికలు తీర్చుకోడానికి, తనలో ఉన్న ఇష్టాఇష్టాలకు సంబంధించి ప్రవర్తించడానికి అయి ఉండకూడదు. తనలో ఉన్న బలాన్ని ఉపయోగించి ఒకడిని అనవసరంగా కొట్టాలి అనే కోరిక ఉండకూడదు.
 వీడు నావాడు, వాడు పరాయివాడు, వాడిని చితక బాదాలి, నా వాడు వెధవ, దుర్మార్గుడు, నీచుడు అయినప్పటికినీ, వాడిని రక్షించాలి అనే రాగద్వేషములు లేకుండా ఉండాలి. అంతే కాకుండా, బలవంతుడు, ధైర్యవంతుడు అయినందుకు, బలహీనులను రక్షించడమే కర్తవ్యంగా పెట్టుకోవాలి. అందుకనే పరమాత్మ, సత్పురుషుడిలో ఉన్న ఉన్న బలం నేనే అని అన్నాడు. అలాగే కోరికలు కూడా నేనే కానీ ఆ కోరికలు ధర్మబద్ధమై ఉండాలి. ధర్మం గా.కలిగే కోరికలు నేనే అని అన్నాడు పరమాత్మ.  కాబట్టి మనలో ఉండే బలం, కోరికలు, ప్రతాపం,.వీరత్వం అన్నీ ధర్మబద్ధంగా ఉంటే భగవంతుని సాయం తప్పక ఉంటుంది. ఆయన పక్కన ఉండి నడిపిస్తాడు. తాత్కాలికంగా అధర్మం పై చెయి అయినా ధర్మమే గెలుస్తుంది. ధర్మమేవ జయతే అని అందుకే అన్నారు.
 ధర్మో రక్షతి రక్షితః 

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts