YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

*జీవుడు - దేవుడు*

*జీవుడు - దేవుడు*

 

*జీవుడు - దేవుడు*
"అపోహయే దుఃఖ హేతువు"  అని శాస్త్ర వచనం.ఒక సింహపు పిల్ల తప్పిపోయి, గొల్లవాని కి  దొరికింది.అతను దానిని తన గొఱ్ఱెల మందలతో పాటు పెంచగా,  కొంచెంఅది పెద్దదైంది.అది గొఱ్ఱెలలోతాను ఒక గొఱ్ఱె ను అనే అనుకునేది...అలాగే ప్రవర్తించేది, ఒకసారి అవన్నీ అడవిలో మేస్తుండగా, వేరే సింహం వచ్చి, ఈమందపై పడింది.గొఱ్ఱెలన్నీ పారిపోయాయి, సింహం పిల్ల కూడ, వాటితో పాటు పారిపోసాగింది...అడవి సింహం దీనిని చూసి, ఆశ్చర్యపడి, ఎలాగో పరుగెత్తి దానిని ఆపింది."చిన్న గొఱ్ఱె ను నన్ను చంపకయ్యా" అంది వణికిపోతూ సింహం పిల్ల.అడివి సింహం నవ్వి, దానిని ఓ కొలను వద్దకు తీసుకెళ్ళి నీటిలో తమ ప్రతి బింబాలను  చూపింది. మూతి పై మీసాలు చూపింది, పిల్ల సింహం గొఱ్ఱె ను కానని తెలుసుకుంది.తాను కూడా సింహమేనని, తలచి సింహంలా గర్జిస్తూ అలాగే సంచరించ సాగింది.ఐతే ఇక్కడ సింహా నికి కొత్తగా వచ్చినది, స్వరూపజ్ఞానమేకాని, స్వరూపం కాదు...మనం అందరం ఆత్మ స్వరూపులం, కాని భక్తులుగా ప్రాకృతమైన జీవితానికి అలవాటు పడి, మన లో ఉన్న పరమాత్మను, విస్మరిస్తున్నాము....*జీవుడు,దేవుడు ఒకటే ... మన స్వస్వరూపం, ఆత్మయే..*
        *_శుభమస్తు_*
సమస్త లోకా సుఖినోభవంతు

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts