YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

పాక్షిక సూర్యగ్రహణం

పాక్షిక సూర్యగ్రహణం

పాక్షిక సూర్యగ్రహణం
*గ్రహణ సమయం ఉ10.25 - 1.54*
జ్యేష్ఠ బహుళ అమావాస్య ఆదివారం అర్ధాధిక రాహుగ్రహస్త పాక్షిక సూర్య గ్రహణం...
ఈరోజు ఆదివారం అగుటచే చూడామణి సూర్య గ్రహణం అని దీనికి పేరు... గ్రహణకాలమందు చేయు స్నాన, జప, తర్పణములు చాలా విశేష ఫలదాయకమని శాస్త్ర వచనం,
*మృగశిర, ఆర్ద్ర నక్షత్రములలో ఈ గ్రహణము సంభవించును, కావున మిథున, ధనుస్సు రాశుల వారు ఈ గ్రహణమును చూడరాదని శాస్త్ర వచనం.*
గ్రహణము నకు ముందు వండిన ఆహారము సూతకాన్నమగుటచే గ్రహణానంతరము ఆ ఆహారము భుజించరాదు.
గ్రహణ సూర్యని ప్రత్యక్షముగా చూచుట కంటికి ప్రమాదకరము, కావున తగు జాగ్రత్తలు తీసుకుని చూడడం మంచిది...
*నిత్య భోజన ప్రత్యాబ్దికాదులు గ్రహణ మోక్షం కాలము(మ1.54తరువాత) తరువాత యధావిధిగా ఆచరించ వలెనని పండితులు అంటున్నారు.*
గ్రహణం మరుసటి రోజు (సోమవారం) యధాశక్తి శాంతి చేసుకోవచ్చు...
  *గ్రహణ స్పర్శకాలము ఉ10.25*
  *గ్రహణ మధ్యకాలము ఉ12.08*
  *గ్రహణ మోక్షకాలము మ1.54*
  *ఆద్యంత పుణ్యకాలము గం3.29ని.లు*
        *శుభమస్తు*
సమస్త లోకా సుఖినోభవంతు

Related Posts