YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

గోవు పాదములు పిత్రు దేవతలు

గోవు పాదములు పిత్రు దేవతలు

గోవు పాదములు పిత్రు దేవతలు

- గోరెశలు తులసీ మాలికలు, గంగా నాధములో ఇమిడి వున్నాడు - కన్ట్టమందు హరుడు ఉండు, వలవల శివుడు ఉండు - వనమధ్యమున గాంధారియుండు, దంతాలు దరిదేవతలబోలు - ముట్టి మునీశ్వరుని బోలు, కళ్ళు అగ్రదేవతను బోలు - ముఖం జేష్టాదేవి, చెవులు శంఖచక్రాలబోలు, మునిపళ్ళు ముత్యాలు బోలు - కొమ్ములు గోవిందుని బోలు, మూపురం విష్ణుమూర్తిని బోలు - వెన్ను యమునా నదిని బోలు, తోక గోదావరిని బోలు - కర్రి కామదేనువును బోలు, పిక్కలు పిడిగంటలు బోలు - పక్కలు పరమేశ్వరుని బోలు, డెక్కలు దేవేంద్రుని బోలు - ఆత్మ ఆదినారాయనుని బోలు, గోళ్ళు కుమారస్వామిని బోలు - పొదుగు పుండరీకాక్షుని బోలు, సన్ను సప్త సముద్రాలు బోలు - పాలు పంచామృతాలు బోలు, నావి తామరాకులను బోలు - రోమాలు లోహితాసుని బోలు, ఎముకలు యమునాదిని బోలు - తోలు యముడిని బోలు, నాలుక నాలుగు వేదంబులను బోలు - బొడ్డు పొన్న పువ్వును బోలు, పంచహస్తంబులో పుట్టిన భాగ్యమతీదేవి - గోకులములో పుట్టిన గోపాల క్రుష్ణమూర్తుల వారి భార్య రుక్మిణీదేవి - బ్రహ్మ భార్య సరస్వతీదేవి - ఈశ్వరుని భార్య పార్వతీదేవి, ధర్మరాజు భార్య ద్రౌపదీదేవి - వశిష్ఠుని భార్య అరుంధతీదేవి ఈ ఐదుగురు కొలువు దీర్చికూర్చున్నారు - ఆడవారు, మగవారు చేసిన పాపంబులు ఎట్లు పోవును ఎలా పోవునని శ్రీకృష్ణులవారి నడిగినారట, గోవును వర్ణించినట్లయిన పాపము లన్నియు పోవునని చెప్పిరి శ్రీకృష్ణమూర్తులవారు. అంటు ముట్టు ఇంటకలిపిన పాపము - బ్రహ్మహత్య చేసిన పాపము, స్త్రీహత్య చేసిన పాపము, శిశుహత్య చేసిన పాపము, గోహత్య చేసిన పాపము, బ్రాహ్మణహత్య చేసిన పాపము, పరులను దూషించిన పాపము, పాకభేదము చేసిన పాపము, గురువును దూషించిన పాపము, గ్రహణ స్నానము చేయని పాపము, భర్తను దూషించిన పాపము, అత్తమామలను దూషించిన పాపము, తల్లిదండ్రులను దూషించిన పాపము, కుమార్తెను అమ్ముకున్న పాపము, పెద్ద కుమారుని ఎడబాసిన పాపము, ఈ పాపములన్నియు ఎత్లాపోవునని శ్రీకృష్ణమూర్తుల వారిని అడిగినారంట, గోవును వర్ణించినట్లయిన పాపంబులన్నియు పోవునని చెప్పిరి శ్రీకృష్ణమూర్తులవారు, గోవును వర్ణించిన వనిత వచ్చింది, త్రోవలు బాగుచేయించండి, ఆవిడ కూర్చున్న గద్దె గంధం అక్షతలు అందించండి, భారతాలు చదివించండి, పురాణాలు వినిపించండి, కాలే కాలే స్తంభాలు కడకి త్రోయించండి, అగ్ని స్తంభాలు ఆర్పించండి, ఉక్కు స్తంభాలు చల్లార్చండి, కారు కాంతులను కడకు త్రోయించండి, ఉద్దండ పురుషులను పార ద్రోలించండి, యమపురి తలుపులను మూయించండి, వైకుంఠం తలుపులు తీయించండి, ఆవిడ వెళ్ళింది స్వర్గలోకము, ప్రొద్దున ఒకసారి గోవును వర్ణించినట్లయిన కాశీలో స్నానము చేసిన ఫలితము, మధ్యాహ్నము ఒకసారి గోవును వర్ణించినట్లయిన అగ్ని దేవతలు ఆపదలు బాపుదురు, సాయంత్రం ఒకసారి గోవును వర్ణించినట్లయిన కోటి శివాలయములలో దీపారాధన చేసినంత ఫలితము అని శ్రీకృష్ణులవారు చెప్పిరి.
గోవు పాదములకు శతకోటి నమస్కారములు. శ్రీకృష్ణమూర్తులవారి పాదపద్మములకు శతకోటి నమస్కారములు. ఈ గోవుపాటను పాడిన విన్న స్వర్గలోకము సంప్రాప్తించును. శ్రీకృష్ణపరమాత్ముడా! నీకు నమస్తే, రుక్నిణీలోలుడా! సత్యభామా సమేతుడా! దేవకీ తనయుడా! వాసుదేవ కుమారా! నీకు నమస్తే నమస్తే నమస్తే నమో నమః !!
 తర్వాత దీపము పెట్టి దీపపు పాటను ఒక్క మారు చదవండి *
ఈశ్వరా! నా దీపము ఇచ్చి రక్షించు పరమాత్మా! నా దీపమును పాలించి చూడు కడకంటి నా దీపమును కన్నెత్తి చూడు నా ప్రమిద నా వత్తు పమిడి వత్తు అచ్చావు నెయ్యి చాలా వడ్డించితిని ఒక చిలుక వేస్తే వేయి చిలుకలను ఇవి ఏకమయి వెలుగును ఏడుఘడియలు, భక్తి ముక్తి గాంచి, ముక్తి భక్తి గాంచి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా! ఆదిమధ్యాంత రహితా! తండ్రీ! నీకు నమస్కారము.

వరకాల మురళీమోహన్ సౌజన్యంతో 

Related Posts