YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పరుగులు పెడుతున్న కాకతీయ మిషన్ పనులు

పరుగులు పెడుతున్న కాకతీయ మిషన్ పనులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మం డల పరిధిలోని వివిధ గ్రామాల్లోని చెరువులు, కుంటలకు మొదటి విడుతలో భాగంగా 5 చెరువులకు రూ.1.18 కోట్లతో, రెండో విడుతలో 10 చెరువులకు రూ.1.30 కోట్లతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడో విడుత 24 చెరువులకు రూ.10.26 కోట్లు మంజూరు కాగా, ఆ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మండలంలోని చెరువులు మరమ్మతులకు నోచుకోలేదు.కాలం అనుకులంగా ఉండడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాక తీయ, మిషన్ భగరీథ పథకాలను పూర్తి చేసేందుకు సిరియస్‌గా సన్నా హాలు మొదలు పెట్టింది. నీటి పారుదల శాఖ, మిషన్ భగరీథ ప్రాజెక్ట్ అధికారులు నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు తమ కిందిస్థాయి అధికారులందరిని అప్రమత్తం చేస్తున్నారు. ఈ మేరకు మే మాసంతం లోగా ఆయా పథకాల పనులన్నింటీని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం మొదటి, రెండవ దశ మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వర్షాలు కురి యడంతో రెండు సార్లు కొన్ని చోట్ల పథకం కింద చెరువుల పనులు పూర్తి కాలేదు. ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం కింద అన్ని చెరువులను పునరుద్దరించేందుకు పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేసింది. ఈ క్రమంలోనే మూడవ దశ మిషన్ కాకతీయ పనులను కూడా చేపట్టిం ది. ఇప్పటికీ మూడు దశల మిషన్ కాకతీయ పనులతో నిర్మల్, ఆది లాబాద్ జిల్లాలోని అన్ని చెరువుల పునరుద్ద చర్యలు మొదలు పెట్టినట్లు అయింది. అయితే మూడవ దశ పనులతో పాటు మిగిలిపోయిన మొదటి, రెండవ దశ చెరువుల పనులను ఈ సంవత్సరం ఎలాగైన పూర్తి చేయాలని అధికారులు లక్షంగా పెట్టుకున్నారు. ఇక నుండి చెరువుల ఆధునీకరణ పనులు మిగిలి ఉండకుండా చూడనున్నారు. దీనికి తోడు గా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో పథకమైన మిషన్ భగీరథ ను సైతం జూన్ మొదటి వారం వరకు పూర్తి చేయాలని సంబందిత అధికారులు లక్షంగా పెట్టున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఈ పథకానికి సంబంధించి ఇన్‌టెక్ వెల్ల నిర్మాణాలు పూర్తి కావచ్చే దశలో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే వీటి నిర్మాణాలు పూర్తి కాబోతున్నందున మరో వైపు పైప్ లైన్ నిర్మాణ పనులు సైతం ఉపందుకున్నాయి. అటవీ శాఖతో పాటు ఇతర శాఖల నుండి ఎదురైన అన్ని ప్రతిబందకాలను అధిగమించి మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టుల నుండి నీటిని ఇన్‌టెక్ వెల్‌లోకి మళ్లీంచి అక్కడి నుండి పైప్ లైన్‌ల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు కుళాయిల ద్వారా తాగునీరు అందిచనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని మెజార్టీ గ్రామాలకు ఈ వేసవి ముగిసేలోగా మిషన్ భగీరథ పథకం ద్వారా తాగు నీరు అందించాలని పకడ్బందీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నారు. మొత్తానికి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను పూర్తి చేయడామే లక్షంగా యంత్రాంగం రాత్రి పగలు శ్రమిస్తోంది.

Related Posts