YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఖరీఫ్ నాటికి రెడీ చేస్తాం!

 ఖరీఫ్ నాటికి రెడీ చేస్తాం!

వ్యవసాయానికి మద్దుతుగా నిలిచేందుకు తెలంగాణ సర్కార్ నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని యత్నిస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ప్రాజెక్టులకు అందించే నిధులు మాత్రం తక్కువగా ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరడంలేదని గద్వాల్ జిల్లావాసులు వ్యాఖ్యానిస్తున్నారు. నిధులు లేకపోవడంతో పలు ప్రాజెక్టుల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇప్పటివరకూ సాగించిన పనులకు చెల్లింపులు ఇచ్చేసి, బకాయిలు తీర్చేస్తే ప్రాజెక్టుల పరిథిలోని వేల ఎకరాల వ్యవసాయ భూమిలో పచ్చదనం పరచుకుంటుందని రైతాంగం చెప్తోంది. ఖరీఫ్‌ నాటికి అన్ని పనులు పూర్తిచేసి ఉమ్మడిజిల్లాలో సాగునీటిని అందించేలా పనులు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ టార్గెట్. దీని కోసం నిధుల కొరత రానివ్వమని సర్కార్ తేల్చి చెప్పింది. అయితే నిధులు ఆశించినమేర అందలేదని సమాచారం. మొత్తం కేటాయింపుల్లో కనీసం సగం నిధులను కూడా విడుదల చేయలేకపోయారని నీటి పారుదల శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పటికైనా నిధులను వెంటనే చెల్లించడంతోపాటు, మిగిలిన పనులు చేపట్టేందుకు ప్రాధాన్యం ఇస్తేనే వచ్చే ఖరీఫ్‌ లక్ష్యం వైపునకు అడుగులు పడతాయని స్పష్టం చేస్తున్నాయి. 

రాబోయే ఖరీఫ్‌లో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. భీమా ప్రాజెక్టు కింద ఇప్పటికే పూర్తి స్థాయి నీటి విడుదల చేయాలని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి 3.65 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా పనులు కొనసాగించాలన్న లక్ష్యం కూడా పెట్టుకున్నారు. ఇక కోయిల్‌సాగర్‌ ద్వారా 55 వేల ఎకరాలకు నీటిని అందించేలా పనులు చేయించాలి. అయితే నిధులు తక్కువగా ఉండడంతో ఈ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఏదేమైనా ప్రభుత్వం నిర్ణయించినట్లే త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సంబంధిత అధికార యంత్రాంగం చెప్తోంది. ఖరీఫ్ నాటికి పథకాలు పూర్తి చేసి 8.20లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అంటోంది. అదే జరిగితే జిల్లా రైతాంగానికి మేలు జరిగినట్లే.

Related Posts