YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

విభజన ప్రక్రియ వేగవంతం కావాలి : కోదండరాం

విభజన ప్రక్రియ వేగవంతం కావాలి : కోదండరాం

విభజన హామీలు గాలికి వదిలేసి ఇసుక మాఫియా, భూ మాఫియా, డ్రగ్స్ మాఫియా లకు పాలకులు వత్తాసు పలుకుతున్నారు తప్ప ప్రజలకు ఉపయోగ పడే పనులు మాత్రం చేయడం లేదని తెలంగాణ జనసమితి (టీజేఎస్) నేత ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. 

ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరి దశం లో అధికారంలోకి వచ్చిన వారు అనేక సరళిని కరణ విధానాలను అవలంబించారు. మౌలిక సదుపాయాల పేరిట అనేక విధ్వంసంలకు తెరలేపారు అప్పటి పాలకులు. ఆంద్రప్రాంత సమస్యలు, అభివృద్ధి,ఇతర అంశాలపై అప్పుడు అనేక సమావేశాలు నిర్వహించామని అయన గుర్తు చేసారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ఏరియలకు స్పెషల్ దేవోలోప్ బోర్డ్ పెట్టాలని సూచించాం. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ఎపి నాయకులు  బిల్లును ఆపే ప్రయత్నమే చేశారు తప్ప విభజన తరువాత హామీల పై నిలదీస్తే బాగుండేదని అయన అన్నారు. విభజన హామీల్లో ఆర్టికల్ 92, 93, 94 ప్రకారం పన్ను రాయితీ ఇవ్వడం జరుగుతుందని  పేర్కొన్నారు. ఆర్టికల్ 93 , 94 ను అమలు చేయాలని కేంద్రం పై ఒత్తిడి పెంచేందుకు కృషి చేయాలని అన్నారు. కార్పొరేషన్ , రాష్ట్ర స్థాయి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల విభజన విషయం లో ఇప్పటికి అమలు కాలేదని అయన అన్నారు. ఏపీలో దళిత సంఘాలు, ప్రజా సంఘాలు రాష్ట్ర విభజన తర్వాత ఎదురయ్యే సమస్యల పట్ల అప్పుడే నినదించారు. విభజన ప్రక్రియ వేగవంతంగా పూర్తి కావాలి. విభజన హామీలను త్వరగా అమలు చేయడానికి ఒత్తిడి పెంచాలని అయన అన్నారు. 

Related Posts