YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాప్రాలో భూ స్కామ్ : రేవంత్ రెడ్డి

కాప్రాలో భూ స్కామ్ : రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో కాప్రాలో వెయ్యి కోట్ల భూ స్కామ్ జరిగింది. ఈ వేయి కోట్ల భూకుంభకోణం సూత్రదారులు ప్రభుత్వ పెద్దలే. లబ్ధిదారులు మైహోం జూపల్లి రామేశ్వర్ రావని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు.   దేశవిభజన సమయంలో రహీమ్ భక్షికి సంబంధించినది ఈ భూమి. ఏవాక్యూ భూమిని నాడు ప్రభుత్వం పాకిస్థాన్ నుండి వచ్చిన ఈశ్వరి భాయి కి కేటాయించింది. 2011 లో సుప్రీం కోర్ట్ అవాక్యు ప్రాపెర్టీ స్పష్టంగా తేల్చింది. సుప్రీం చెప్పిన తర్వాత ప్రభుత్వ ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. రామేశ్వర్ రావు కు  భూమిని కట్టబెట్టేందుకు నిబంధలనలను కేటీఆర్ పక్కనబెట్టారు. ప్రభుత్వ భూమి అని రికార్డ్స్ ఉండగా ..జూపల్లి రామేశ్వర్ రావు 20ఎకరాల్లో రియలెస్టేట్ ఎలా చేస్తారు. ఈ భూమిపై జిపిఎ ఉన్న బాలకృష్ణ ను పోలీసులతో బెదిరించి రామేశ్వర్ రావ్ పేరుమీద సెల్ డీడ్ చేయించుకున్నారని అయన అన్నారు. ఏవాక్యూ భూమిని లేఔట్ లు చేసి మైహోం అమ్ముకుంటుంది. కేటీఆర్ స్వంత శాఖ లో ఈ తతంగం జరుగుతుంటే కనబడదాలేదా అని నిలదీసారు. గుడిసెలు వేసుకుంటే తొలగిస్తారు  కానీ వేల కోట్ల భూమిని మైహోం దోచుకుంటే కనవాడదా  అని అడిగారు. కాప్రా లో మైహోం భూదందా చేస్తున్నది వాస్తవమా కాదా కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేసారు. కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటె అక్కడ జరుగుతున్న అమ్మకాలను అడ్డుకోవాలి. ఏవాక్యూ ప్రాపెర్టీస్ ను కొల్లగొడుతున్నారని మీ పత్రికలో వచ్చింది నిజం కాదా కేటీఆర్ అని అన్నారు. ఈ ప్రభుత్వ కస్టోడియమ్ గా స్వాధీనం చేసుకోవాలి. ఎకరాలను గజనాలకు మార్చి అమాయకులను మైహోం బక్రాలను చేస్తుందని విమర్శించారు. ఈ భూమికి సంబంధించిన సమాచారాన్ని కేటీఆర్ కు ఇచ్చేనందుకు నేను రెడీ అని అన్నారు. కేటీఆర్ చెప్పేందుకు నాకెలాంటి భేషజాలు లేవు. ప్రభుత్వం భూమిని రామేశ్వరావ్ దోచుకుంటుంటే చూస్తూ ఉరుకోమని అన్నారు. ఈ భూదందాపై న్యాయస్థానానికి వెళతాం. కేటీఆర్ తో ఆభూమి పరిశీలనకు వెళ్లేందుకు నేను రెడీ అని స్పష్టం చేసారు. కేటీఆర్ కు బంధుప్రీతి లేకపోతే తక్షణమే ఆ భూములను పరిశీలించాలని అన్నారు. 

Related Posts