YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డబుల్ బెడ్ రూమ్ కు మరిన్ని కష్టాలు

డబుల్ బెడ్ రూమ్ కు మరిన్ని కష్టాలు

ఎన్నిక‌ల నాటికి రెండు ల‌క్ష‌ల డ‌బుల్ బెడ్రూం ఇళ్లు క‌ట్టిస్తాం.. లేదంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట్లు అడ‌గం ఇదీ టిఆరెస్ హామీ.మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్ని డ‌బుల్ బెడ్రూం ఇళ్లు పూర్తైయ్యాయి.డ‌బుల్ బెడ్రూం నిర్మాణంలో దూసుకుపోయేదెవ‌రు.ఇంకా ఇళ్ల నిర్మాణానికి పునాది రాయి కూడా వెయ్యిని నేత‌లు ఎంత మంది.డ‌బుల్ బెడ్రూం ఇళ్ల‌లో గులాబీ నేత‌ల పెర్ఫామెన్స్ ఎలా ఉంది.ఈ స్కీం అమలు పైనే రానున్న ఎన్నిక‌ల్లో నేత‌ల భ‌విత‌వ్యం అదార‌ప‌డిందా.పేద వర్గాల సొంతింటి కలను సాకారం చేసేందుకు డ‌బుల్ బెడ్రూం స్కీం ను స‌ర్కార్ చేప‌ట్టింది.. ఎన్నికల్లో ముందు ఇచ్చిన మాట ప్రకారం ఐదేళ్ళు దాటకముందే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ళను నిర్మించి తీరుతామ‌ని తెలంగాణా ప్ర‌భుత్వం చెబుతుంది.పేద‌ల‌కు రెండు ల‌క్ష‌ల డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్లు క‌ట్టివ్వ‌క పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓటు కూడా అడ‌గ‌మ‌ని టిఆరెస్ నేత‌లు ప్ర‌క‌టించారు.కానీ నేత‌ల మాటల్లో ఉన్న స్పీడ్ డ‌బుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో క‌నిపించ‌డం లేదు.రాష్ట్రంలో జ‌రుగుతున్న డ‌బుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల ప్రోగ్రెస్ చూస్తే ప‌రిస్తితి ఇట్టే అర్దం అవుతుంది. మంజూరైన వాటిలో కేవ‌లం 5శాతం ఇళ్లు మాత్ర‌మే పూర్తైయ్యాయి.మిగ‌తావి 10శాతం నిర్మాణంలో ఉన్నాయి.ఇక మెజారిటీ జిల్లాల్లో డ‌బుల్ బెడ్రూం ఇళ్ల‌కు పునాది కూడా ప‌డ‌లేదు.ఇప్ప‌టి వ‌ర‌కూ రాష్ట్రంలో డ‌బుల్ బెడ్రూం ఇళ్ల పురోగ‌తి చూస్తే .. ఎన్నిక‌ల నాటికి ఈ హామీ నెర‌వేరే ప‌రిస్తితి క‌నిపించ‌డం లేదు.సీఎం కేసిఆర్ తో పాటు మంత్రులు కేటిఆర్ ,హ‌రీష్ రావ్,తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు డ‌బుల్ బెడ్రూం ఇళ్లు నిర్మింపచేయ‌డంతో దూసుకుపోతున్నారు.సిద్దిపేట జిల్లాలో 250కోట్ల రూపాయ‌ల‌తో 3353 డ‌బుల్ బెడ్రూం ఇళ్లు నిర్మాణం పూర్తైయ్యాయి.ఇక భ‌ద్రాద్రి కొత్త గూడెం,ఖమ్మం జిల్లాల్లో 185కోట్ల రూపాయ‌ల‌తో 1820 ఇళ్లు పూర్తి అయ్యాయి.ఈ న‌లుగురు మంత్రులు ప్ర‌త్యేక దృష్టి సారించి త‌మ జిల్లాల్లో డ‌బుల్ బెడ్రూం స్కీం గాడిన ప‌డేలా చేస్తున్నారు.ఇక గృహ‌నిర్మాణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అతి త‌క్కువ నిర్మాణాల‌తో వెన‌క‌డుగులో ఉన్నారు.నిర్మల్ జిల్లాలో కేవ‌లం 45ఇళ్లు మాత్ర‌మే పూర్తి చేశారు.3360 ఇళ్లు నిర్మించాల‌ని టార్గెట్ పెట్టుకుంటే ఈ స్కీం మొద‌లైన నాటినుంచి ఇప్ప‌టివ‌ర‌కు 50 డ‌బుల్ డెడ్రూం ఇళ్లు కూడా క‌ట్ట‌లేదంటే ఆ శాఖ మంత్రి ఎంత పూర్ పెర్ఫామెన్స్ లో ఉన్నారో ఇట్టే అర్దం అవుతుంది.వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నిర్మ‌ల్ లో వంద ఇళ్లు కూడా పూర్తి కావ‌ని అర్దం అవుతుంది.ఇంకా దారుణ‌మైన విష‌యం ఏమిటంటే ... ఈ స్కీం పై టిఆరెస్ ఎమ్మెల్యేలు చాలా వెనుక‌బ‌డే ఉన్నార‌ని చెప్పాలి.ఒక్క ఇళ్లు కూడా నిర్మించ‌లేని ప‌రిస్తితిలో ఎంత మంది ఉన్నారో తెలిస్తే ఎమ్మెల్యేల ప‌నితీరు ఇట్టే తెలుస్తుంది.నాగ‌ర్ క‌ర్నూల్,వ‌న‌ప‌ర్తి,మెద‌క్,సంగారెడ్డి,కొమ‌రం భీం ఆసిఫాబాద్,మంచిర్యాల్,పెద్ద‌ప‌ల్లి ,జ‌న‌గాం,భువ‌న‌గిరి,వికారాబాద్,మేడ్చ‌ల్ జిల్లాల్లో ఒక్క డ‌బుల్ బెడ్రూం ఇళ్లు కూడా పూర్తి కాలేదు.ఈ 11జిల్లాల్లో టెండ‌ర్ల ప్ర‌క్రియ పూర్తై ఏడాది కాలం గ‌డిచినా ఇళ్ల నిర్మాణం మాత్రం గాలికి వ‌దిలేశారు.నిర్మాణాలు ప‌ర్య‌వేక్షించాల్సిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు అస‌లు ప‌ట్టించుకోక పోవ‌డం వ‌ల్లే ఈ ప‌రిస్తితి ఏర్ప‌డిందంటున్నారు స్థానికులు.31జిల్లాల్లో మొత్తం 2ల‌క్ష‌ల‌72వేల‌763 మంజూరైయ్యాయి.వీటిలో 2ల‌క్ష‌ల 42వేల 341 ఇళ్ల‌కు ప‌రిపాల‌న అనుమ‌తులు వ‌చ్చాయి.మొత్తం 2ల‌క్ష‌ల‌19వేల 699 ఇళ్ల‌కు టెండ‌ర్లు పిలువ‌గా ఇందులో 1ల‌క్ష‌78వేల‌503ఇళ్ల‌కు టెండ‌ర్లు ఖ‌రారైయ్యాయి.టెండ‌ర్లు ఓకే అయిన వాటిల్లో 1ల‌క్షా50వేల‌542 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించామ‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా.. 31 జిల్లాల్లో కేవ‌లం 9వేల‌522ఇళ్లు మాత్ర‌మే పూర్తి చేశామ‌ని స‌ర్కారు చెబుతుంది.వాస్త‌వానికి ఈ ఏడాది మార్చి నాటికి రెండు ల‌క్ష‌ల డ‌బుల్ బెడ్రూం ఇళ్లు క‌ట్టి తీరుతామ‌ని చెప్పినా క‌నీసం ప‌ది శాతం ఇళ్లు కూడా క‌ట్ట‌లేక‌పోయింది. ప్ర‌భుత్వం చెబుతున్న లెక్క‌ల ప్రకారం చేస్తే రెండు ల‌క్ష‌ల ఇళ్లు క‌ట్టాలంటే రాబోయే ఐదేళ్లులో కూడా అనుకున్న ల‌క్ష్యాన్ని చేరేట్టులేద‌ని తెలుస్తుంది.ఈ డ‌బుల్ బెడ్రూం ఇళ్లు కేవ‌లం సీఎం కేసిఆర్ .. మంత్రులు హ‌రీష్ రావ్ ,కేటిఆర్ ,తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావ్ నియోజ‌క వ‌ర్గాల్లోనే ఎక్కువ సంఖ్య‌లో నిర్మాణాలు జ‌రుగుతున్నాయ‌ని కొంద‌రు మంత్రులు బ‌హిరంగ‌గానే అంటున్నారు.కొన్ని జిల్లాలో డ‌బుల్ బెడ్రూం ఇళ్లు క‌ట్టేందుకు బిల్డ‌ర్లు ముందుకు రావ‌డం లేద‌ని ...అందువ‌ల్ల శంఖుస్తాప‌న‌లు కూడా జ‌ర‌గ‌టం లేద‌ని ఎమ్మెల్యేలు వాద‌న‌.ప‌రిస్తితి ఇలాగే ఉంటే డ‌బుల్ బెడ్రూం ఇళ్ల ల‌క్ష్యం,టార్గెట్ నెర‌వేర‌డం క‌ష్ట‌మే అంటున్నారు కొంద‌రు టిఆరెస్ నేత‌లు.ఇచ్చిన హామీ నెర‌వేర‌లంటే ప్ర‌భుత్వం సీరియ‌స్ గా దృష్టిసారించ‌క త‌ప్ప‌దు.

Related Posts