YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో టీటీడీ బోర్డు ఆశలు

తెలంగాణలో టీటీడీ బోర్డు ఆశలు

హైద్రాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్టుపైన తెలంగాణ టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. టీటీడీ సభ్యులకు అవకాశం దక్కించుకోవడానికి పార్టీ సీనియర్ నేతలు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం ఇద్దరు తెలంగాణ నాయకులకు బోర్డులో ఛాన్స్ ఉండగా డజను మంది నాయకులు పోటీ పడుతున్నారు. టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవిని భర్తీ చేయడంతో ఇప్పుడు బోర్డు సభ్యుల నియామకం పైన సస్పెన్స్ నెలకొన్నది.కడప జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ ను ఛైర్మన్ గా నియమిస్తు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.అయితే కమిటిని మాత్రం ముఖ్యమంత్రి ప్రకటించలేదు. కమిటి సభ్యులపై చంద్రబాబు తుది కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. దీంతో ఆశావాహులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా టీటీడీ బోర్డులో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇస్తారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు కూడా టీడీపీ సర్కార్ అవకాశమిచ్చింది. గత బోర్డులో తెలంగాణ తెలుగుదేశానికి చెందిన ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు మరో ఎమ్మెల్యే సాయన్నను బోర్డు సభ్యులుగా నియమించారు. అయితే సాయన్న టీడీపీని వదిలిపెట్టి టీఆర్ఎస్ లో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన టీడీపీ నేత అరికెల నర్సారెడ్డికి బోర్డు సభ్యుడిగా అవకాశమిచ్చారు. ఈ సారి బోర్డులో స్థానం కోసం తెలంగాణ నేతలు పోటీపడుతున్నారు. గత బోర్డులో సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేరు మళ్ళీ వినిపిస్తోంది. అయితే సండ్ర మాత్రం తనను బోర్డు సభ్యుడిగా నియమించవద్దని చంద్రబాబునాయుడికి స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో తాను సమయం కేటాయించలేనని ఆయన తెలిపారు. దీంతో సండ్ర పేరును పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. సీనియర్ నేత ఇనగాల పెద్దిరెడ్డి తనకు టీటీడీ బోర్టు లో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే క్రైస్తవ మతప్రభోదకుడు కెఎ పాల్ తో పెద్దిరెడ్డికి సన్నిహిత సంబంధాలు న్నాయి.పాల్ కార్యక్రమాల్లో ఆయన తరుచు కనిపిస్తుంటారు. ఒక వేళ పెద్దిరెడ్డిని బోర్డులో తీసుకుంటే వివాదమయ్యే సూచనలున్నాయి. తన ప్రసంగాలతో అధినేత చంద్రబాబునాయుడిని మెప్పించే పార్టీ నేత నన్నూరి నర్సిరెడ్డి కూడా టీటీడీపైన ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు అవకాశాలు మెరుగుగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి బుచ్చిలింగం తనకు ఛాన్స్ ఇవ్వాలని అధినేతను కోరారు. సీనియర్ నేతలు కొత్తకోట దయాకర్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్‌తో పాటు మరికొందరు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలను ద్రుష్టిలో ఉంచుకొని ఇద్దరు లేదా ముగ్గురికి బోర్డులో చంద్రబాబు అవకాశం ఇవ్వనున్నారు.

Related Posts