YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మేలో కొత్త ఓట‌ర్ల న‌మోదుకు ప్ర‌త్యేక డ్రైవ్ ....!!

Highlights

  • బి.ఎల్‌.ఓలుగా రిటైర్డ్ ఉద్యోగులు సి.ఇ.ఓ ర‌జ‌త్‌కుమార్‌
మేలో కొత్త ఓట‌ర్ల న‌మోదుకు ప్ర‌త్యేక డ్రైవ్  ....!!
హైదరాబాద్ : మే 1వ తేదీ నుండి 31వ తేదీ వ‌ర‌కు 18ఏళ్లు నిండినవారిని ఓట‌ర్లుగా న‌మోదుకు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్న‌ట్టు ముఖ్య ఎన్నిక‌ల అధికారి ర‌జ‌త్‌కుమార్ ప్ర‌క‌టించారు. 2018 జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు 18ఏళ్లు నిండిన ప్ర‌తిఒక్క‌రిని ఓటరుగా చేర్పించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ అనేది నిరంత‌ర ప్ర‌క్రియ అని, బ‌దిలీ అయిన‌వారు, మ‌ర‌ణించినవారి ఓట‌ర్ల‌ను తొల‌గించ‌డం పూర్తి ఆదారాల‌తోనే చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. ఈ నెల 15 నుండి 30వ తేదీ వ‌ర‌కు బూత్‌లేవ‌ల్ అధికారుల నియామ‌కం, శిక్ష‌ణ‌, ఇత‌ర ఏర్పాట్ల‌ను పూర్తిచేసుకోవాల‌ని సూచించారు. గ‌త సంవ‌త్‌చరం గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ప‌రిధిలో ఎన్నిక‌ల జాబిత స‌వ‌ర‌ణ‌ను స‌మ‌ర్థ‌వంతంగా చేప‌ట్ట‌డం ప‌ట్ల సీఇఓ ర‌జ‌త్‌కుమార్ జీహెచ్ఎంసీ అధికారుల‌ను అభినందించారు. ఇదే స్ఫూర్తితో తిరిగి మే 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఓట‌ర్ల జాబితా ప్యూరిఫికేష‌న్ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల‌ని తెలిపారు. ఖాళీగా ఉన్న బూత్ స్థాయి అధికారుల‌ను రిటైర్డ్ ఉద్యోగుల‌ను నియ‌మించ‌డంలో ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గ ఓట‌ర్ల న‌మోదు అధికారుల‌కు సూచించారు. రిటైర్డ్ అయిన‌ప్ప‌టికీ టైర్డ్ (శారీర‌కంగా, ప‌టిష్టంగా ఉన్న) కాని ఉద్యోగుల‌ను బి.ఎల్‌.ఓలుగా నియ‌మించాల‌న్న జీహెచ్ఎంసీ నిర్ణయాన్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా ప్ర‌శంసించింద‌ని గుర్తుచేశారు. అదేవిధంగా దివ్యాంగుల‌ను కూడా బి.ఎల్‌.ఓలుగాను, ఎన్నిక‌ల ప్ర‌క్రియలో భాగ‌స్వాములు చేయాల‌ని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలోని అన్ని స‌ర్కిల్ కార్యాల‌యాల్లో ప్ర‌తి సోమ‌వారం నాడు ప్ర‌త్యేకంగా ఓట‌ర్ల న‌మోదు, ప్యూరిఫికేష‌న్ దినోత్స‌వంగా పాటించాల‌ని ఆదేశించారు.

Related Posts