YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చినుకు పడితే చిత్తడవుతున్న ప్రధాన రహదారి.

చినుకు పడితే చిత్తడవుతున్న ప్రధాన రహదారి.

చొప్పదండి జూలై 7,
జిల్లాలోనే ప్రఖ్యాతి గల మండలం ఎందరో మాహానుబావులు మంత్రులు ముఖ్య మంత్రులు ఎం ఎల్ ఏ లు రాష్ట్ర జిల్లా అధికారులు వెల్లిన ప్రధాన రహదారి. మరమ్మత్తులకు నోచుకోని దౌర్బగ్య స్థితిలో తన మరమ్మత్తు పనులను ఏ ప్రజా ప్రతి నిధి చేస్తాడానని ఎదిరిచూస్తూ చినుకు పడితే చాలు ప్రతి నిత్యం బురద నీటితో స్నానం చేస్తున్న గంగాధర ( ప్రస్తుత మధురా నగర్) క్రాస్ రోడ్డు ధీన స్థితి తన మరమ్మత్తులను చేపట్టేందుకు ప్రజా ప్రతి నిదులు ముందుకు వచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్న రోడ్డు.  
-----ఇది ఎక్కడి పరిస్థితి
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని (ప్రస్తుత మధురానగర్ గ్రామ పంచాయతీ పరిధి ) క్రాస్ రోడ్డు వద్ద కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి పూర్తిగా చెడిపోయి విపరీతమైన గుంతలతో చిన్న పాటి వర్షం పడితే చాలు గుంతలలో నీరు చేరి బురదమయంతో వాహనాలకు ప్రజలకు ఇబ్బందిగా తయారుకావడంతో పాటు ప్రమాదాలు కూడ సంబవిస్తున్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుండి నిజామాబాద్, ధర్మపురి, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, వేములవాడ, సిరిసిల్ల జగిత్యాల పలు జిల్లా కేంద్రాలకే కాకుండా మారుమూల గ్రామాలకు కూడా ప్రతి నిత్యం ఆర్ టీ సి బస్సులు ప్రైవేట్ వాహనాలు మాటార్ సైకిల్లు వేలాది వాహనాలు ఈ ప్రధాన రహదారి వెంట రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఈ దారి వెంట పవిత్ర పుణ్యక్షేత్రాలైన ధర్మ పురి, కొండగట్టు, వేములావాడ పుణ్యక్షేత్రాలకు కేంద్ర రాష్ట్ర మంత్రులు గవర్నర్ అధికారులు ఎందరో వాహనాలలో వెల్లిన సందర్బాలు ఎన్నో అయినప్పటికి వారకి ఈ రోడ్డు పరిస్థితి రనిపించలేదానని పలువురు ప్రయానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల, మెట్ పల్లి, కోరుట్ల, నిజామాబాద్, ఆర్మూర్ వంటి పట్టణాలలోని హాస్పిటల్ నుండి మెరగైన వైద్య చికిత్స కొరకు హైదరాబాద్, కరీంనగర్ లోని పెద్ద హాస్పిటల్లకు కూడా రోజు అంబులెన్స్ లు చాలా వెలుతుంటాయి. ఇక్కడి ఎగుడు దిగుడు రోడ్డుతో అంబులెన్స్ లో ఉన్న పేషెంట్లు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాలసిందే. దానకి తోడు గంగాధర మండలం మంగపేట వద్ద రైల్వేస్టేషన్ ఉండటంతో ఇక్కడి నుండి గూడ్స్ రైల్లు వెలుతుంటాయి. గూడ్స్ రైల్ల ద్వారా గ్రానైట్ బండలను తరలించడానికి లారీల ద్వారా తీసుకోని వస్తుంటారు. దానివల్ల కూడా రోడ్డు మరింత దెబ్బతినే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. గతంలో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసినట్లు వార్తలు వచ్చినప్పటికి ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రోడ్డు రవాణా శాఖ మంత్రి గా పని చేసిన టీ జీవన్ రెడ్డి హాయంలో నాలుగు లైన్ల రోడ్డు పనులు జరుగుతాయని ఎదిరిచూసిన ప్రజలకు నిరాశే మిగిలింది. గతంలో కరీంనగర్ ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ దీనిపై పట్టించుకోలేదు. ప్రస్తుత ఎంపి బండి సంజయ్ కుమార్ కూడా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ రోడ్డు పరిస్థితిని ప్రతి నిత్యం గమనిస్తున్న గంగాధర ఎంపిపి శ్రీరాం మధుకర్ మరియు కొంత మంది స్వచ్చందంగా గతంలో టాక్టర్ ల ద్వారా మట్టిని పోయించినప్పటికి తాత్కాలికంగా మాత్రమే గుంతులు పూడ్చినప్పటికి వర్షం పడితే మరింత బపరదమయమవుతుంది. కనీసం ఇప్పటికైన స్థానిక చొప్పదండి నియోజక వర్గ ఎం ఎల్ ఏ సుంకె రవి శంకర్ ఎంపి బండి సంజయ్ కుమార్ లు దృష్టి సారించి ప్రభుత్వానికి తెలియ చేసి శాశ్వత పరిష్కారం చేసి ఇక్కడ రోడ్డు మరమ్మత్తు పనులను చేపట్టాలని పలువురు వాహన దారులు కోరుతున్నారు.
 

Related Posts