YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నగరంలో పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు నాటుదాం... వాతావరణ సమతుల్యత కాపాడుదాం..! - జిల్లా కలెక్టర్ కే.శశాంక

నగరంలో పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు నాటుదాం... వాతావరణ సమతుల్యత కాపాడుదాం..!  - జిల్లా కలెక్టర్ కే.శశాంక

కరీంనగర్ జూలై 7, 
మొక్కలు నాటడంతో పాటు...వాటి సంరక్షణ చర్యల పై ప్రత్యేక దృష్ఠి సారించామని జిల్లా కలెక్టర్ కే.శశాంక అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 వ విడుత హరితహారం కార్యక్రమం మంగళవారం రోజు 17 వ డివిజన్ పరిదిలో గల శాతవాహాన యూనివర్సిటీలో జరిగింది. నగరపాలక సంస్థ ఆద్వర్యంలో చేపట్టిన హరితహారంలో మేయర్ సునిల్ రావు, కమీషనర్ వల్లూరు క్రాంతి, యూనివర్సిటీ రిజిస్ట్రర్ భరత్ తో కలిసి జిల్లా కలెక్టర్ కే.శశాంక మొక్కలు నాటారు. అనంతరం యూనివర్సిటీ ఆవరణలో మూడు ఎకరాల ఖాళీ స్థలంతో పాటు 3 వేల మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేసి గుంతలను పరిశీలించారు. నగరపాలక సంస్థ హారితహార సిబ్బందికి మొక్కలు నాటే ప్రక్రియ పై పలు సలహాలు, సూచనలు చేస్తూ... ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ సమతుల్యత కోసం చేపట్టిన హారితహారం కరీంనగర్ లో గత రెండు వారాలుగా ముమ్మారంగా కొనసాగుతుందన్నారు. నగర వ్యాప్తంగా ప్రధాన రహాదారులకు ఇరువైపులా, ఖాళీ ప్రదేశాలు ఉన్న చోట మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ మైదనాలు ఉన్న చోట మరియు ప్రభుత్వ కార్యాలయాల స్థలాల్లో మియావాకీ పద్దతిలో మొక్కలు నాటుతున్నామని తెలిపారు. నగర ప్రజల కోరిక ప్రకారం ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేస్తామన్నారు. నగరంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు...వాటిని సంరక్షించే చర్యలు పకడ్బందిగా చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు 2 మీటర్ల పొడవు ఉన్న మొక్కలను రహాదారులు, ఇతర ప్రదేశాల్లో నాటడం జరుగుతుందన్నారు. నగరపాలక సంస్థ నర్సరీలో ఉన్న మొక్కలతో పాటు బయట నుండి మొక్కలను కొనుగోలు చేసి...పెద్ద ఎత్తున మొక్కలను నాటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నగరంలో పచ్చదనం వెల్లి విరిసేలా...ప్రతి ఇంటి ముందు పచ్చ తోరణం కనిపించే విధంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. వర్షాలు సంమృద్దిగా కురవాలన్న... గాలి కాలుష్యం తగ్గలన్న నగర వాసులు వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మీ మీ ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటిని కాపాడలని సూచించారు. వచ్చే తరాలకు మంచి ప్రకృతి వాతావరణం అందించాలని కోరారు. తమ వంతు భాద్యతగా ప్రజలంతా 6 వ విడుత హరితహారంలో పాల్గొని మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. గత రెండు వారాలుగా నగర యజ్ఞంలా మొక్కలు నాటుతున్న మేయర్, కమీషనర్, కార్పోరేటర్లు, నగరపాలక సంస్థ సిబ్బంది కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాతావాహాన యూనివర్సిిటీ రిజిస్ట్రార్ భరత్ మరియు ప్రొఫేసర్లు, నగరపాలక సంస్థ ఈఈ రామన్, ఎంమ్మార్వో వెంకటేశ్వర్లు, ఏఈ మోహాన్ రెడ్డి, హారితహారం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

Related Posts