YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

లక్ష్మీ గవ్వల ఉపయోగాలు

లక్ష్మీ గవ్వల ఉపయోగాలు

పూర్వం క్షీర సాగరమథనం సమయంలో సముద్రంనుండి శ్రీమహాలక్ష్మీదేవి, గవ్వలు, శంఖు, అమృతం, హాళాహలం ఉద్భవించాయి అందుకే గవ్వలను లక్ష్మీదేవి సోదరిగాను, శంఖును సోదరుడిగాను పేర్కొంటారు. అందుకే గవ్వలు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తుంటారు అని ఒక కధనం కాగా మరొక కధనం ప్రకారం లక్ష్మీదేవి సముద్రుడి కుమార్తె. గవ్వలు సముద్రంలో లభిస్తాయి గవ్వలు, శంఖాలు లక్ష్మీదేవి సోదరి, సోదరులు అని అంటారు. గవ్వలు వివిధ రంగులలో, వివిధ ఆకారాలలో లభిస్తాయి. వాటిలో పసుపురంగులో మెరిసే గవ్వలను 'లక్ష్మీ గవ్వలు'గా భావించి పూజిస్తారు. గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుంది. మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటంతో పాటు శంఖు, గవ్వలను కూడా పీఠంపై పెట్టి ప్రార్థించడం ఆచారంగా వస్తుంది. ఈ విధంగా పూజించే వారికి సిరిసంపదలతో పాటు సుఖసంతోషాలు కూడా కలుగుతాయి. లక్ష్మీగవ్వలను పూజించి డబ్బులు దాచే దగ్గర, బీరువాలలో, అరలు (సేల్ఫ్స్)లోను పెట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం తప్పక ఉంటుంది. లక్ష్మీగవ్వలు ఉన్న ఇంట్లో సిరిసంపదలు, ధనాధ్యాలు వృద్ధి చెందుతాయి. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా ఆ ఇంట్లో నడిచి వస్తుంది అని నమ్ముతారు. లక్ష్మీదేవితో పాటు పరమేశ్వరుడికి కూడా గవ్వలతో అనుబంధం ఉంది. పరమేశ్వరుడికి చేసే అష్టాదశ అలంకారాలలో గవ్వలు కూడా ప్రధానంగా చోటుచేసుకుంటాయి. శివుడి జటాజూటంలో, నందీశ్వరుడి మెడలో కూడా గవ్వలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో గవ్వలు ఆడుతూ లక్ష్మీదేవిని ఆహ్వానించే ఆచారం కూడా వుంది....

Related Posts