YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కీచక టీచర్ పై గ్రామస్థుల ఆగ్రహం....!!

 కీచక టీచర్ పై గ్రామస్థుల ఆగ్రహం....!!

కామారెడ్డి : విద్యార్థుల కు పాఠాలు బోధించల్సిన ఉపాధ్యాయుడు వాటిని ప్రక్కన పెట్టి ప్రేమ పురాణాలు బొధించడం మొదలు పెట్టాడు. విద్యార్థులకు మాయ మాటలు చెప్పి సినిమాలకు తీసుకెళ్లే వాడు. తన వద్ద భారీగా ఆస్తి వుందని మాయ మాటలు చెప్పి తనను పెళ్లి చెసుకోమని బెదిరించేవాడు. ఇలా వారిని బుట్టలో వేసుకోవాలని ప్రయత్నం చేసేవాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన విజయకుమార్ ఇదే మండలంలోని పెద్ద ఎక్లార ఉన్నత పాఠశాల లో ఫిజికల్ సైన్స్ ఉపాద్యాయుడు గా పని చేస్తున్నారు. గత మూడు నెలలుగా పదవతరగతి చదువుతున్న విధ్యార్థి నిలకు చదువులు పక్కన పెట్టి ప్రేమ పాఠాలు బోధించడం మొదలు పెట్టాడు. విధ్యార్థి నిలకు తాను ఇష్టమని, తనకు భారీగా ఆస్తి వుందని, తనని పెళ్లి చేసుకోవాలని తరచూ చెప్పువాడు. దాంతోపాటు ప్రేమ లేఖలు వ్రాసేవాడు. అంతే కాకుండా ఇటీవలే పదవ తరగతి పరీక్ష లు ముగియగానే సినిమాలకు టీసుకేళ్లినట్లు కుడా గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. టీచర్ లీలు బయటకు రాగానే గ్రామస్థులు విజయ్ కుమార్ ను గదిలో బంధించి దాడికి యత్నించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గ్రామస్థులకు నచ్చచెప్పి విజయ్ ను పోలీసు స్టేషన్ కు తరలించారు. కీచక టీచర్ ను విధుల నుంచి తొలగించాలని గ్రామస్థులు పట్టుపట్టారు. విషయం తెలుసుకుని, విచారణకు వచ్చిన మండల విద్యాశాఖ అధికారి రాములు మాట్లాడుతూ ఉపాద్యాయు ని ఉదంతం పై జిల్లా అధికారులకు నివేదికలిచ్చామని అన్నారు. నిందితుడిని తక్షణం విధులనుండి తొలగించామని అన్నారు.

Related Posts