YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆరోగ్య క‌ర జ‌ల‌మే జ‌నాల‌కి బ‌లం : మిష‌న్ భ‌గీర‌థ వాట‌ర్ ట్యాంక్‌కి శంకుస్థాప‌న చేసిన మంత్రి ల‌క్ష్మారెడ్డి

Highlights

  • ఆరోగ్య క‌ర జ‌ల‌మే జ‌నాల‌కి బ‌లం జ‌డ్చ‌ర్ల‌, బాదేప‌ల్లిల‌లో 9వేల కుటుంబాల‌కు ఇంటింటికీ న‌ల్లాల ద్వారా మంచి నీరు
  • ఆరోగ్య క‌ర నీటితో 30 ర‌కాల రోగాల‌కు చెక్‌ మిష‌న్ భ‌గీర‌థ వాట‌ర్ ట్యాంక్‌కి శంకుస్థాప‌న చేసిన మంత్రి ల‌క్ష్మారెడ్డి
ఆరోగ్య క‌ర జ‌ల‌మే జ‌నాల‌కి బ‌లం  :  మిష‌న్ భ‌గీర‌థ వాట‌ర్ ట్యాంక్‌కి శంకుస్థాప‌న చేసిన మంత్రి ల‌క్ష్మారెడ్డి
సీఎం కెసిఆర్ అప‌ర భ‌గీర‌థ ప్ర‌య‌త్న‌మే భ‌గీర‌థ‌ ప‌థ‌కం మంచినీర‌న్నారు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి. ఇంటింటికీ న‌ల్లాల ద్వారా భ‌గీర‌థ నీటిని అందించే బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌ద‌ని, దీని ద్వారా ఆరోగ్య క‌ర స‌మాజ నిర్మాణం సాధ్య‌మ‌వుతుంద‌ని మంత్రి చెప్పారు. బాదేప‌ల్లిలో రూ.48 కోట్ల‌తో చేప‌ట్టిన భ‌గీర‌థ మంచినీటి ట్యాంకుకి మంత్రి గురువారం శంకు స్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ, కెసిఆర్ ప్ర‌భుత్వం దేశంలో ఎక్క‌డా లేని విధంగా భ‌గీర‌థ ప‌థ‌కం ద్వారా ఇంటింటికీ మంచినీటిని న‌ల్లాల ద్వారా అందిస్తున్న‌ట్లు చెప్పారు. భ‌గీర‌థ‌ మంచినీటి ప‌థ‌కం ద్వారా ఆరోగ్య తెలంగాణ సాధ్య‌మవుతుంద‌న్నారు. నీటి ద్వారా వ్యాపించే 30 ర‌కాల వ్యాధుల‌కు భ‌గీర‌థ మంచినీటి ద్వారా చెక్ పెట్టొచ్చ‌న్నారు. భ‌గీర‌థ నీటిని కేవ‌లం మంచినీటిలా మాత్ర‌మే చూడొద్ద‌ని, ఆరోగ్య జ‌లంగా ప‌రిగ‌ణించాల‌ని మంత్రి చెప్పారు. భూగ‌ర్భ జ‌లాలు అడుగంటి అనేక ఆరోగ్య క‌ర ల‌వ‌ణాలు న‌శించి, ఆరోగ్యాలు క్షీణించి, కిడ్నీల వంటి స‌మ‌స్య‌లు వ్యాప్తి చెందుతున్నాయ‌న్నారు. భూ ఉప‌రిత‌ల నీరు, న‌దీ జ‌లాలు, వ‌ర్ష‌పు జ‌లాలు ఆరోగ్య‌క‌ర‌మైవ‌న‌వ‌ని, న‌దీ జ‌లాల‌నే ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌భుత్వం ఇంటింటికీ న‌ల్లాల ద్వారా అందిస్తున్న‌ట్లు మంత్రి వివ‌రించారు. జ‌డ్చ‌ర్ల‌, బాదేప‌ల్లిల‌లో 9వేల కుటుంబాల‌కు ఆరోగ్య క‌ర జ‌లం బాదేప‌ల్లిలో ప్ర‌స్తుతం చేప‌ట్టిన మ‌ష‌న్ భ‌గీర‌థ‌ మంచినీటి ట్యాంకు ద్వారా బాదేప‌ల్లి, జ‌డ్చ‌ర్ల‌ల్లో 9వేల కుటుంబాల‌కు నేరుగా న‌ల్లాల ద్వారా 24 గంట‌ల పాటు నీరు అందుతుంద‌ని మంత్రి చెప్పారు. దీంతో జ‌డ్చ‌ర్ల‌, బాదేప‌ల్లి ప్ర‌జ‌ల దాహార్తి పూర్తిగా తీర‌డ‌మేగాక‌, ఆరోగ్యంగా ఉండే అవ‌కాశం ప్ర‌జ‌ల‌కు ల‌భిస్తుంద‌న్నారు. బాదేప‌ల్లి, జ‌డ్చ‌ర్ల‌ల్లో రోడ్ల వెడ‌ల్పు, తారు, సిమెంట్ అంత‌ర్గ‌త రోడ్లు, మురుగునీటి కాలువ‌లు, పార్కులు, సెంట్ర‌ల్ లైటింగ్ సిస్ట‌మ్ వంటి స‌దుపాయాల‌న్నీ క‌లుగుతున్నాయ‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి తెలిపారు. మరికొద్ది రోజుల్లోనే గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా బాదేప‌ల్లి, జ‌డ్చ‌ర్ల‌లు స‌ర్వాంగ సుంద‌రంగా మారుతాయ‌ని మంత్రి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, పుర ప్ర‌ముఖులు, ప్ర‌జ‌లు పాల్గ‌న్నారు.

Related Posts