YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జీహెచ్ఎంసీ ద్వారా 40 చెరువుల అభివృద్ది: మంత్రి కేటీఆర్

 జీహెచ్ఎంసీ ద్వారా 40 చెరువుల అభివృద్ది: మంత్రి కేటీఆర్

ఓఆర్ఆర్ లోపల 40 చెరువులను జీహెచ్ఎంసీ ద్వారా రూ. 441 కోట్లతో అభివృద్ది చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హెచ్ఎండీఎ ద్వారా మరో 38 చెరువుల అభివృద్ది చేపట్టనున్నట్లు తెలిపారు. నెక్నాంపూర్ చెరువు అభివృద్ది పనులకుమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం లో 46000 చెరువులను మిషన్ మోడ్ లో అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. చెరువుల అభివృద్దిలో స్టానికుల సహకారం అవసరమన్నారు. ప్రతి చెరువు పూర్తిస్టాయి నీటి మట్టంలో నిర్మాణాలను నివారిస్తాం. చెరువుల అభివృద్ది పర్యవేక్షణకు యువ ఐఏఎస్ అధికారి నేతృత్వం వహించనున్నాడు. చెరువుల్లో మురుగు నీరు కలువకుండా సీవరెజి ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. గండిపేట అభివృద్దికి రూ.100 కోట్లను కెటాయించాం. 100 ఫ్లాట్లు వున్న అన్ని అపార్టుమెంట్లలో తప్పనిసరిగా ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని..ఇది బిల్డర్ల భాద్యతని కేటీర్ నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి. నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ కమీషనర్ జనార్దనరెడ్డి, హెచ్ ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. 

Related Posts