YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పరకాలలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్...!!

 పరకాలలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్...!!
వరంగల్ జిల్లా పరకాలలో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పట్టణంలోని భూపాలపల్లి రోడ్డులో ఈ వ్యవస్థను ప్రారంభించారు. దీంతో స్థానికంగా రాత్రిపూట లైట్లు విఫలమయ్యే అవకాశాలు తగ్గిపోనున్నాయి. రహదారులపై రాకపోకలు సజావుగా సాగేందుకు వీలుంటుంది. ఇదిలాఉంటే గూడెప్పాడ్‌ నుంచి పరకాల మీదుగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరు వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు సాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా పరకాలలోని హన్మకొండ రహదారి నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు, అక్కడి నుంచి భూపాలపల్లి రోడ్డులోని పెట్రోల్‌ బంకు వరకు డివైడర్లు ఏర్పాటుచేశారు. ఈ విభాగినుల మధ్యలో సెంట్రల్‌ లైటింగ్‌ వ్యవస్థకు సంబంధించిన స్తంభాలను ఏర్పాటుచేయాలి. కానీ ఈ పనులు ఆలస్యమయ్యాయి. దీంతో కార్పోరేషన్ అధికారులు రోడ్డుకు ఇరువైపులా ట్యూబ్‌లైట్లనే ఏర్పాటు చేశారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన స్తంభాల ఏర్పాటులో జాప్యం ఉండడంతో కార్పోరేషన్ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే భూపాలపల్లి రోడ్డులోని పెట్రోల్‌ బంకు నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వైపు ట్యూబ్‌లైట్ల ఏర్పాటు నిమిత్తం స్తంభాలను బిగిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ పనులు పూర్తి కానున్నాయని చెప్తున్నారు. ఇక స్తంభాల ఏర్పాటు పూర్తైన వెంటనే లైట్లను బిగించే కార్యక్రమం సైతం జరిగిపోతుంది. మొత్తంగా 7 రోజుల్లో లైట్లు పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ఆర్టీసీ బస్‌స్టేషన్‌ వరకు, బస్‌స్టేషన్‌ నుంచి వెల్లంపల్లి రోడ్డులో సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు చేయగా దీపాలు బిగించారు. హన్మకొండ, భూపాలపల్లి రోడ్డులోనూ ఆ లైట్లు పని చేస్తే పట్టణమంతటా సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం పనిచేస్తుందని చెప్తున్నారు.

Related Posts