YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

న్యాయమూర్తి ఇంట్లో ఏసీబీ సోదాలు

న్యాయమూర్తి ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్ ఒకటో అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జి ఎస్ రాధాకృష్ణమూర్తి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఒక డ్రగ్స్ కేసు నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు అయన రూ. 7.5 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై గురువారం అర్ధరాత్రి నుంచి ఏసీబీ సోదాలు జరిగాయి. ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసిన ఓ వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు ఆయన డబ్బు డిమాండ్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఒక బెయిల్ విషయం లో అవినీతి ఆరోపణలు రావడంతో హై కోర్ట్ ఆదేశాలతో జడ్జి రాధాకృష్ణ మూర్తి ఇంట్లో సోదాలు చేస్తున్నాం. డ్రగ్స్ కేస్ లో ఒక వ్యక్తికి బెయిల్ ఇవడం కోసం డబూలు డిమాండ్ చేశారని ఆరోపణ ఉందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ అల్వాల్ తో పాటు మరి రెండు చోట్ల సోదాలు కొనసాగాయి. రాధ కృష్ణ మూర్తి ఇంటి తో పాటు మరో ఇద్దరు న్యాయవాదుల ఇళ్లపై కుడా సోదాలు నిర్వహించారు. రాధ కృష్ణమూర్తికి డబ్బిచ్చి తాను బెయిల్ తెచ్చుకున్నానని బాధితుడు దత్తు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, హైకోర్టు దీన్ని తీవ్రమైన నేరంగా పేర్కొంది. ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి విచారించాలని ఆదేశించింది. గత సంవత్సరం ఓ నైజీరియన్ తో కలసి దత్తు అనే ప్రొఫెసర్ ను అరెస్ట్ చేయగా, బెయిల్ ఇచ్చేందుకు రూ. 11 లక్షలను రాధాకృష్ణ మూర్తి డిమాండ్ చేశారని, చివరకు రూ. 7.5 లక్షలకు బేరం కుదిరిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ ఈ న్యాయమూర్తిపై ఆరోపణలు వచ్చాయని, ఆదాయానికి మించిన ఆస్తులను సంపాదించారన్న ఆరోపణలపైనా సోదాలు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఆస్తులను గుర్తించాం కానీ అవి సక్రమంగా కాదా అని దర్యాప్తు లో తేలాలి. బ్యాంక్ లాకర్, వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు లభించాయి. కేసులో నిందితుడికి, జడ్జికి మధ్యవర్తులుగా వ్యవహరించిన న్యాయవాదులపైన కేసు నమోదైంది. న్యాయవాదులు శ్రీనివాస్‌రావు, సతీష్‌ కుమార్‌లను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జడ్జి, ఇద్దరు న్యాయవాదులను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి తరలించామని ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రమణ కుమార్ వివరించారు.

Related Posts