YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పార్లమెంట్ కొత్త భవనం.. మూడు కంపెనీల లిస్టింగ్

పార్లమెంట్ కొత్త భవనం.. మూడు కంపెనీల లిస్టింగ్

న్యూఢిల్లీ, ఆగస్టు 13
పార్లమెంటు కొత్త భవన నిర్మాణ పనులను అప్పగించడం కోసం కేంద్రం మూడు సంస్థలను షార్ట్‌ లిస్ట్‌ చేసింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) లిమిటెడ్‌, టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, షపూర్‌జీ పల్లాంజీ అండ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌లు తుది దశ బిడ్డింగ్‌కు అర్హత సాధించాయి. ఈ బిడ్డింగ్‌కు మొత్తం ఏడు కంపెనీలు ఆసక్తి చూపగా.. కేంద్ర ప్రజా పనుల విభాగం నాలుగు సంస్థల దరఖాస్తులను తిరస్కరించింది. షార్ట్‌ లిస్ట్‌ అయిన మూడు కంపెనీలు త్వరలోనే తమ ఫైనాన్షియల్‌ బిడ్స్‌ను సమర్పించనున్నాయి.‘2022 నాటికి భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ (వజ్రోత్సవ) వేడుకల్ని జరుపుకోబోతోంది. ఆ సమయానికి కొత్త పార్లమెంటు భవనంలో ఉభయ సభల సమావేశాలు జరగాలి’ గతేడాది లోక్‌సభ స్పీకర్ వ్యాఖ్యానించారు. అయితే, కరోనా వైరస్ కారణంగా దీనికి సంబంధించిన ప్రక్రియ ఆలస్యమైంది. వాస్తవానికి, కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి యూపీఏ-2 హయాంలోనే ప్రతిపాదన వచ్చింది.నాటి స్పీకర్ మీరా కుమారి దీనిపై సూచనలు కోరుతూ ఓ కమిటీని కూడా నియమించారు. 85 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలనలో నిర్మించిన పార్లమెంటు బిల్డింగ్ ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదన్న కారణంతో పాటు పురాతన భవనాల్ని కాపాడుకోవాలని నాటి ప్రభుత్వం అభిప్రాయపడింది.మరోవైపు ప్రపంచ వారసత్వ సంపదగా భారత పార్లమెంటుకు గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని చెక్కు చెదరకుండా భావి తరాలకు అందించేందుకు కొత్త భవనం నిర్మించి అందులో కార్యకలాపాలు చేపట్టాలని 2019 ఆగస్టు 5న రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. ప్రధాని మోదీకి ప్రతిపాదించారు.

Related Posts