YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తాతకు దేవాన్షు షాక్

తాతకు దేవాన్షు షాక్

హైద్రాబాద్, ఆగస్టు 15, 
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్‌మీట్ సమయంలో జరిగిన ఈ సీన్ ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోొంది. ఆ వీడియో చూసి తెలుగు తమ్ముళ్లు మురిసిపోతున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబుకు మనవడు దేవాన్ష్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కాగా.. దేవాన్ష్‌ సూపర్ అంటూ తెలుగు తమ్ముళ్లు మురిసిపోతున్నారు. చంద్రబాబు ప్రెస్‌మీట్ సమయంలో జరిగిన ఈ సీన్ ఆసక్తికరంగా మారింది. బాబు జూమ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు.. అమరావతి అంశంపై స్పందించారు.. తాజా పరిణామాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. దాదాపు గంటసేపు ఈ మీడియా సమావేశం కొనసాగింది.ఈ ప్రెస్‌మీట్ జరుగుతున్న సమయంలోనే దేవాన్ష్ కూడా ఉన్నట్టుండి లైవ్‌లో ప్రత్యక్షమయ్యాడు. తాత చంద్రబాబు వెనుక ఉన్న పుస్తకాన్ని తీసుకునేందుకు వచ్చాడు. ఇంతలో లైవ్ జరుగుతోందని గమనించాడు.. కెమెరాకు దొరక్కుండా జాగ్రత్తగా తాత పక్కకు జరిగాడు. తనకు కావాల్సిన బుక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియోను కొందరు తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు దేవాన్ష్ తీసుకున్న పుస్తకం అక్బర్ బీర్బల్ కథకు సంబంధించినదని చెబుతున్నారు.

Related Posts