YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మార్క్ లేకుండా వనిత

మార్క్ లేకుండా వనిత

ఏలూరు, ఆగస్టు 28, 
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన తానేటి వ‌నిత‌కు జ‌గ‌న్‌.. త‌న కేబినెట్‌లో కీల‌క‌మైన శాఖ‌ను అప్పగించారు. అస‌లు త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ఆమె క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. అయిన‌ప్పటికీ.. ఎస్సీ కోటాలో స్త్రీ, శిశుసంక్షేమ శాఖ‌ను అప్పగించిన త‌న కేబినెట్‌లో చేర్చుకున్నారు జ‌గ‌న్. ఆమెకు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఎవ్వరూ ఊహించ‌లేదు.. ఎస్సీల‌కు జ‌గ‌న్ ఏకంగా ఐదు మంత్రి ప‌ద‌వులు ఇవ్వడంతో ఆమెకు అనూహ్యంగా ల‌క్ చిక్కిన‌ట్లయ్యింది. అయితే, ఇప్పటికి ఏడాదిన్నర పైగా అయిన‌ప్పటికీ.. మంత్రిగా త‌న ముద్ర వేసుకోవ‌డంలో వ‌నిత వెనుక బ‌డ్డార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. నిజానికి ఆమెతోపాటు మంత్రులుగా ఉన్న పుష్ప శ్రీవాణి, మేక‌తోటి సుచ‌రిత వంటివారు అప్పుడో ఇప్పుడో.. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు దూకుడుగా ఉన్నారు.కానీ, వనిత మాత్రం ఎక్కడా దూకుడు చూప‌లేక పోతున్నారు. పైగా త‌న శాఖ‌కు సంబంధించిన ప్రోగ్రెస్ విష‌యంలో అయినా ప్రజ‌ల‌కు చెప్పాల‌నే ధ్యాస ఆమెకు లేకుండా పోయింద‌నే విమ‌ర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. స‌హ‌జంగా ఏ నేత అయినా.. త‌న‌కు అప్పగించిన శాఖ‌లో ఫ‌స్ట్ ఉండాల‌నో.. లేక ఎప్పటిక‌ప్పుడు దూకుడు ప్రద‌ర్శించాలనో నాయ‌కులు కోరుకుంటారు. కానీ, వ‌నిత విష‌యంలో ఈ త‌ర‌హా ఆలోచ‌న ఎక్కడా క‌నిపించ‌డం లేదు. తాను ఏం చేస్తున్నారో.. త‌న వ‌ల్ల ప్రజ‌ల‌కు ఎలాంటి మేలు జ‌రుగుతోందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి క‌నిపిస్తోందినిన్న మొన్నటి వ‌ర‌కు పూర్తి సైలెంట్‌గా ఉన్న పినిపే విశ్వరూప్‌, శంక‌ర్ నారాయ‌ణ లాంటి మంత్రులు సైతం నోరు పెగ‌ల్చేందుకు ప్రయ‌త్నిస్తుంటే వ‌నిత మాత్రం ఇంకా మౌన‌వ్రతంలో ఉన్నట్టే క‌నిపిస్తున్నారు. క‌నీసం శాఖాప‌ర‌మైన విమ‌ర్శల‌కు కూడా ఆమె ప్రతిప‌క్షాల‌కు ఘాటైన కౌంట‌ర్లు ఇవ్వలేక‌పోతున్నారు. పోనీ.. నియోజ‌క‌వ‌ర్గంలో అయినా దూకుడుగా ఉన్నారా? అంటే అది కూడా క‌నిపించ‌డం లేదు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ‌నిత‌.. ఒక‌సారి టీడీపీలో ఉండ‌గా గెలుపు గుర్రం ఎక్కారు. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైఎస్సార్ సీపీ త‌ర‌ఫున గెలిచిన వ‌నిత‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.ప్రస్తుతం స‌మ‌కాలీన రాజ‌కీయాల‌కు అనుగుణంగా రాజ‌కీయంగా దూకుడు ప్రద‌ర్శించ‌డంలో వ‌నిత దూకుడు ప్రద‌ర్శించ‌లేక పోయారు. పోనీ.. త‌న వ్యవ‌హారం ఇప్పటితో అయిపోతుందా? అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆమె స‌త్తా చూపించుకునే అవ‌కాశం ఎక్కువగా ఉంది. కొవ్వూరులో టీడీపీ బ‌ల‌మైన పార్టీ. ఇక్కడ కేడ‌ర్ ఎక్కువ‌. అయితే, న‌డిపించే నాయ‌కుడులేరు… ఈ స‌మ‌యంలో వ‌నిత‌ దూకుడు పెంచితే ఇక్కడ ఆమె పార్టీ ప‌రంగా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. కానీ, ఆ త‌ర‌హాలో ముందుకు వెళ్లడం లేదు. ఏదేమైనా మంత్రిగా రాష్ట్ర స్థాయిలోనూ త‌న‌దైన ముద్ర వేయ‌లేక‌పోతోన్న ఆమె క‌నీసం ఎమ్మెల్యేగా నియోజ‌క‌వ‌ర్గంలోనూ స‌త్తా చాట‌లేక‌పోతున్నార‌న్న చ‌ర్చలే వినిపిస్తున్నాయి.

Related Posts