YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రెంటికి చెడ్డ రేవడిలా రఘురామ

రెంటికి చెడ్డ రేవడిలా రఘురామ

న్యూఢిల్లీ, ఆగస్టు 28, 
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఇప్పుడు బీజేపీ కూడా విరోధిగా మారుతుంది. ఆయన అనుకున్న ప్రయత్నం వికటించిందంటున్నారు. రఘురామ కృష్ణంరాజు నిజానికి బీజేపీకి దగ్గరవ్వాలనే వైసీపీకి దూరమయ్యారు. బీజేపీలో చేరితే తనకు ఇబ్బంది ఉండదని భావించారు. అందుకే ఆయన ఎంపీగా గెలిచిన నాటి నుంచి బీజేపీ నేతలను తరచూ కలుస్తూ లాబీయింగ్ చేస్తూ వచ్చారు. అనర్హత వేటు తనపై పడదన్న గట్టి నమ్మకంతో రఘురామ కృష్ణంరాజు ఉన్నారు.కానీ రోజురోజుకూ బీజేపీకి, రఘురామకృష్ణంరాజుకు మధ్య గ్యాప్ పెరిగిపోతున్నట్లు కన్పిస్తుంది. రాజధాని అమరావతి విషయంలో బీజేపీ నేతల అభిప్రాయాలను తోసిపుచ్చారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదన్న జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యాలను ఆయన తప్పు పట్టారు. రాజధాని విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకుంటుందని పదే పదే రోజూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చెబుతున్నారు.గతంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి బాధ్యతను రఘురామ కృష్ణంరాజు తీసుకున్నట్లు కనపడుతుంది. అయితే ఇది బీజేపీ రాష్ట్ర నేతలకు ఇబ్బందికరంగా మారింది. రఘురామ కృష్ణంరాజు మీద బీజేపీ రాష్ట్ర నేతలు ఎటాక్ ప్రారంభించారు. బీజేపీకి లోక్ సభ సభ్యుల మద్దతు అవసరం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బీజేపీకి దగ్గరకావాలనుకున్న రాజుగారు ఆ పార్టీ నేతలతోనే కయ్యానికి దిగడంతో ఆ దారి కూడా మూసుకుపోయినట్లేనంటున్నారు.  మరోవైపు రఘురామ కృష్ణంరాజు నిత్యం చేస్తున్న విమర్శలకు విలువ లేకుండా చేయడానికి వైసీపీ కూడా రంగంలోకి దిగింది. చంద్రబాబు చేతిలో రఘురామ కృష‌్ణంరాజు టూల్ గా మారారని విమర్శలు సంధిస్తున్నారు. రఘురామ కృష‌్ణంరాజు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలతో కయ్యానికి దిగి ఏం సాధించాలనుకుంటున్నారని ఆయన అనుచరుల నుంచి వస్తున్న ప్రశ్న. ప్రస్తుతం ఇబ్బంది కరంగా ఉన్న టీడీపీకి చేరువై చేసేదేముందన్న కామెంట్స్ కూడా విన్పిస్తున్నాయి.

Related Posts