YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సుప్రీంకోర్టు నిర్ణయం శుభపరిణామం

సుప్రీంకోర్టు నిర్ణయం శుభపరిణామం

విజయవాడ ఆగస్టు 28,
రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వాగతించారు.  ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం శుభపరిణామం.   వర్గీకరణకు దేశంలో మొదటిసారిగా ప్రతిపాదించింది అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. రిజర్వేషన్ల ఫలాలు సమాజంలో అట్టడుగు వర్గాల వారికి అందడం లేదనే అప్పట్లో ఎస్సీ వర్గీకరణ చేయాలని చంద్రబాబు నాయుడు విధానపరమైన నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో తీర్మానం చేశారు.  అది ఎంత సమంజసమైనదో ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన సందేశంతో అర్ధమవుతోంది. అప్పట్లో పార్లమెంటులో చట్టం చేయాలనే నిబంధనతో అసెంబ్లీలో చేసిన తీర్మానం అమలుకాలేదు. వర్గీకరణ హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని ఇప్పుడు కోర్టు చెబుతోంది.  రిజర్వేషన్ల ప్రక్రియను సమూలంగా సమీక్షించి అట్టడుగు వర్గాల వారికి, ఇంత కాలం రిజర్వేషన్లకు నోచుకోని వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.   రిజర్వేషన్లలో క్రీమీలేయర్ విధానాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది.  క్రీమీలేయర్ ప్రస్తుతం సమాజానికి ఎంతో అవసరమైన అంశం.  ఒకే కుటుంబంలో మూడు తరాలుగా రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న వారిని చూస్తున్నాం. అదే సమయంలో మూడు తరాలుగా ఎలాంటి రిజర్వేషన్ ఫలాలు అనుభవించకుండా అణగారిన వర్గాలుగా మిగిలిని వారినీ చూస్తున్నాం.  ఈ అసమానతలను తొలగించడానికి క్రీమీలేయర్ విధానాన్ని కూడా పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని అయన అన్నారు.

Related Posts