YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఓం ప్రతాప్ మృతిపై జ్యూడీషియల్ విచారణ జరగాలి మాజీ మంత్రి చినరాజప్ప

ఓం ప్రతాప్ మృతిపై జ్యూడీషియల్ విచారణ జరగాలి మాజీ మంత్రి చినరాజప్ప

విజయవాడ ఆగస్టు 28,
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి, పులవర్తి నాని, గౌనివారి శ్రీనివాసులు, బి.ఎన్. రాజసింహులుతో పలువురు నేతలను అక్రమంగా గృహనిర్భంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. చనిపోయిన ఓం ప్రతాప్ కుటుంబాన్ని పరామర్శించడానికి తెలుగుదేశం పార్టీ నేతలు వెళుతుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యాలు ఏ విధంగా తారు మారు చేశారో ఓం ప్రతాప్ కేసులో కూడా సాక్ష్యాలు తారు మారు చేస్తున్నారు. మృతుడి సెల్ ఫోన్ ను మాయం చేసిన విషయం వాస్తవం కాదా? ఫోన్ కాల్ లిస్ట్ ను ఎందుకు బయటపెట్టడం లేదు? మద్యం బ్రాండ్లపై, ధరలపై ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నందుకు దళిత యువకున్ని హత మార్చారా? మంత్రి పెద్దిరెడ్డి రామాచంద్రరెడ్డిపై ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు? దళిత మేజిస్ట్రేట్ రామకృష్ణ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించి మంత్రి అనుచరులు వేధిస్తున్న విషయం వాస్తవం కాదా? చిత్తూరు జిల్లాలో ఉండే ప్రశాంతమైన వాతావరణాన్ని మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు విచ్చిన్నం చేస్తున్నారు. జిల్లాలో శాంతిభద్రతలు లోపిస్తే పరిశ్రమలు ఏ విధంగా వస్తాయి? బడుగు, బలహీన వర్గాలకు జిల్లాలో రక్షణ లేకుండా పోయిందని అయన అన్నారు.  వైసీపీ నేతల దౌర్జన్యాలు అఘాయిత్యాలపై, ఓం ప్రకాత్ ఘటనపై మేధావులు, దళిత సంఘాలు స్పందించాలి. ప్రభుత్వం మృతుని కుటుంబ సభ్యులకు రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలి. జ్యూడిషియరీ విచారణకు ఆదేశించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని చినరాజప్ప అన్నారు.

Related Posts