YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చిన వైసీపీ ప్రభుత్వం... టిడిపి రాష్ట్ర అధ్యక్ష్యులు కళా వెంకట్రావు

జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చిన వైసీపీ ప్రభుత్వం...  టిడిపి రాష్ట్ర అధ్యక్ష్యులు కళా వెంకట్రావు

గుంటూరు ఆగష్టు 28 
వైసీపీ ప్రభుత్వం జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చి, రాష్ట్రాన్ని పేకాటాంధ్రప్రదేశ్ గా మార్చిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యులు కళా వెంకట్రావు  తీవ్ర స్థాయి లో విరుచుక పడ్డారు. చట్టానికి లోబడి వ్యవహరిస్తామని చెప్పి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.  పేకాట శిభిరాల నిర్వహణకు నైతిక భాధ్యత వహిస్తూ మంత్రి జయరాం రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. రాష్ర్టంలో వైసీపీ మంత్రులు, నేతలే పేకాట క్లబ్బులు, గుండాట శిబిరాలు నిర్వహిస్తూ జూదాన్ని రాష్ట్ర క్రీడగా చేసి, రాష్ట్రాన్ని పేకాంటాంధ్రప్రదేశ్ గా మర్చారు.  పేకాటను ఒలంపిక్స్ లో చేర్చాలని వైసీపీ నేతలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామంలోనే మంత్రి అనుచరులు, వైసీపీ నేతలు పేకాట ఆడుతూ పట్టుబడుటమే కాక, పట్టుకున్న పోలీసులపై దాడిచేయటం హేయమైన చర్య.  మంత్రి స్వగ్రామం అంటే సంక్షేమం, అభివృద్ది లో ముందు వరుసలో నిలిపి మిగతా వారికి ఆదర్శంగా ఉండాలి. కానీ  పేకాట శిబిరాలు, నాటు సారా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను, ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా లూటీ చేయటం సిగ్గుచేటు. వైసీపీ మంత్రులు చట్టానికి లోబడి వ్యవహరిస్తామని  ప్రమాణం చేసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం సిగ్గుచేటు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. మంత్రి ప్రోద్బలంతోనే మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ (వైసీపీ చిప్పగిరి మండల కన్వీనర్) పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు.  ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి జయరాం రాజీనామా చేయాలి. దీనిపై విచారణ జరిపించి  తన నిజాయితీ నిరూపించుకోవాలి.  మంత్రిపై ఆరోపణలు వస్తే కనీసం ముఖ్యమంత్రి ఎందుకు మంత్రిని మందలించలేదు?రాష్ర్టంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే రాష్ర్టంలోనే కాక ముఖ్యమంత్రి జగన్మోహరెడ్డి సొంత  నియోజకవకర్గం పులివెందులలో కూడా కూడా వైసీపీనేతలు యదేచ్చగా పెద్ద ఎత్తున పేకాట క్లబ్బులు గుండాట నిర్వహించి ప్రజలను దోచుకుంటున్నారు.  వైసీపీ నేతల కనుసన్నల్లోనే రాష్ర్టంలో పేకాట క్లబ్బులు, గుండాట శిబిరాలు, నాటు సారా తయారీ కేంద్రాలు నడుస్తున్నాయి.  వైసీపీ నేతలు తమ అక్రమ సంపాదన కోసం  అడ్డదారులు తొక్కుతూ సామాన్య ప్రజల జీవితాలను చిన్నాబిన్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలపాలపై దృష్టి పెట్టి వాటికి అడ్డుకట్ట వేయాలి. లేకపోతే ప్రజలే మీ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేస్తారని హెచ్చరించారు

Related Posts