YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపాలోకి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల

వైకాపాలోకి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల

విజయవాడ ఆగస్టు 28 
తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైకాపా కండువా కప్పుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్  అయను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తరువాత పంచకర్ల రమేష్ బాబు,  రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి,  మంత్రులు అవంతి శ్రీనివాసరావు, వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.  రమేష్ బాబు మాట్లాడుతూ మార్చి 10వ తేదీ తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశాను. సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆకర్షితుడై వైఎస్ఆర్ పార్టీలో చేరనన్నారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో ఇచ్చిన మాట లను తూచా తప్పకుండా పాటించి ప్రజలకు న్యాయం చేస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి చేస్తున్న కార్యక్రమాలకు ముగ్ధులై పార్టీలో చేరాను. రాష్ట్రంలో మంచి గెస్ట్ హౌస్ కట్టుకునే వీలు లేని విధంగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారం కోల్పోయిన తరువాత ఏం చేయాలో అర్థం లేని పరిస్థితుల్లో మాట్లాడుతున్నారన్నారు.  చంద్రబాబు కొడుకు నాయకత్వాన్ని వద్దని ఆనాడే చెప్పానని పంచకర్ల తెలిపారు. దొడ్డిదారిలో లోకేష్ ని ఎమ్మెల్సీ చేసి మంత్రిగా చేసి మాకు ఆయన అండర్ లో పని చేయమని బలవంతంగా మాపై రుద్దారన్నారు. జగను సిద్ధాంతాలకు లోబడి పార్టీలో కార్యకర్తల పని చేస్తానని తెలిపారు. ఉత్తరాంధ్ర కు సీఎం జగన్ వల్ల మంచి రోజులు వచ్చాయి అన్నారు.  ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు సహకరించటం లేదని ఈ సందర్భంగా తెలిపారు. 13 జిల్లాల అభివృద్ధికి కృషి చేయడమే జగన్ ముఖ్య లక్ష్యం అన్నారు. వైయస్సార్ పార్టీ లో చేరేందుకు సహకరించిన విజయసాయి రెడ్డికి మంత్రి అవంతి శ్రీనివాస్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు  కృతజ్ఞతలు తెలిపారు.  విజయ్ సాయి రెడ్డి మాట్లాడుతూ పంచకర్ల రమేష్ బాబు కి వైయస్సార్ పార్టీ లో సముచిత స్థానం పార్టీలో కల్పిస్తామన్నారు.  రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్నారు. న్యాయ స్థానాలపై గౌరవం ఉందన్నారు  న్యాయస్థానంలో రాజధాని విషయంలో న్యాయం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి కులపిచ్చి ఉందని విజయసాయిరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Related Posts