YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మంత్రి వనిత నిరసన

మంత్రి వనిత నిరసన

ఏలూరు ఆగష్టు 31  
ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసన బాట పట్టాయి.దీంట్లో బాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పాత బస్టాండ్ దగ్గరలో ఉన్న డా.బి.ఆర్.అంబేత్కర్  విగ్రహానికి పూలమాల వేసి ప్రతిపక్షాల వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత వినతిపత్రం సమర్పించారు. 14 సంవ‌త్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ద‌ళితుల‌ను అణ‌గ‌తొక్కిన చంద్ర‌బాబు, ఓడిపోయిన త‌రువాత కూడా ద‌ళితుల‌కు ప్ర‌భుత్వ‌ సంక్షేమ ఫ‌లాలు అంద‌కుండా కోర్టులను అడ్డంపెట్టుకొని ప్ర‌భుత్వాన్ని అడ్డుకుంటున్నారు అన్నారు. రాష్ట్రంలో ఎన్న‌డు లేని విధంగా ముఖ్య‌మంత్రి  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రు పేద‌ల‌కు ముఖ్యంగా ద‌ళితుల‌కు, బ‌ల‌హీనవ‌ర్గాల‌కు ఇళ్ల‌ప‌ట్టాలు, ఇళ్లు క‌ట్టించే కార్య‌క్రమం తీసుకొంటే తెలుగుదేశం పార్టీ, ప్ర‌తిప‌క్ష పార్టీలు వాటిని రాకుండా అడ్డుకున్నారు. దీనితో పాటు తెలుగుదేశం పార్టీ అమ‌రావ‌తిని గొప్ప రాజ‌ధానిగా చెప్పుకుంటూ ఆ ప్రాంతంలో వేలాది మంది ద‌ళితుల‌కి, బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇవ్వ‌కుండా కోర్టుల ద్వారా అడ్డుప‌డ్డారు. దీనితోపాటు పేద‌ల‌కు ఉప‌యోగ‌పడే ఇంగ్లీష్ మీడియం చ‌దువుల‌ను సైతం అడ్డుకుంటున్నారాని మంత్రి అన్నారు.

Related Posts