YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కోర్టు మొట్టికాయలే శ్రీ రామరక్ష

కోర్టు మొట్టికాయలే శ్రీ రామరక్ష

విజయవాడ, సెప్టెంబర్ 1, 
సానుభూతి సెంటిమెంట్ భారత్ లాంటి దేశాల్లోనే ఎక్కువగా వర్కౌట్ అవుతుంది. సానుభూతి అన్నది జగన్ తన రాజకీయ ఎదుగుదలకు బాగా ఉపయోగించుకున్న అతి పెద్ద అంశం. జగన్ తన తండ్రిని కోల్పోయారని నాడు సానుభూతి వచ్చింది. తరువాత జైలు పాలు అయ్యారని కూడా ఇదే సానుభూతి వెల్లువెత్తింది. ఇక జగన్ పాదయాత్ర చేయడం కూడా ఓ రకంగా సానుభూతి అంశమే. తమ కోసం ఇన్ని వేళ కిలోమీటర్లు నడిచాడు అంటూ జనం నాడు తల్లడిల్లారు. ఇక జగన్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకున్నపుడు, ఆయన్ని, ఆయన పార్టీని తన అయిదేళ్ల పదవీకాలంలో వేధించినపుడు కూడా జనం సానుభూతే చూపారు. ఇపుడు మళ్ళీ అలాంటి సీన్ క్రియేట్ కాబోతోందా అన్న చర్చ ఒకటి ఏపీలో నడుస్తోంది.  జగన్ సర్కార్ కోర్టుల నుంచి ఇప్ప్పటిక 90కి పైగా మొట్టికాయలు తిన్నది. ఇది సామాన్య జనంలోకి కూడా వెళ్ళిపోయింది. జగన్ ఏ పధకం తలపెట్టినా విపక్షాలు కోర్టుకు వెళ్తున్నాయని, అక్కడ అడ్డుకుంటున్నాయన్న మాట కూడా ప్రచారంలోకి వచ్చేసింది. ముఖ్యంగా పేదలకు ఇళ్ల పంపిణీకు జగన్ సిధ్ధపడినా కానీయ‌డం లేదని, ఆయన సర్కారీ స్కూళ్ళలో ఇంగ్లీష్ చదువు కోసం పరితపిస్తూంటే విపక్ష పార్టీలు వారు తప్పుడు ఆరోపణలు చేస్తూ అడ్డుకుంటున్నాయని కూడా జనసామాన్యంలోకి వైసీపీ విజయవంతంగా పంపించగలిగింది. ఇపుడు మూడు రాజధానుల అంశం కోర్టు విచారణలో ఉంది. ఇది ఎన్నాళ్ళు సాగినా కూడా టీడీపీ, చంద్రబాబుకు వ్యతిరేకంగానే ప్రచారం చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. తద్వారా బాబుని రాజకీయంగా కార్నర్ చేయాలనుకుంటోంది.తాను ప్రజల కోసం ఆలోచిస్తూ మంచి చేయాలనుకుంటున్నానని, కానీ చేయనీయడంలేని ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్యనే వ్యాఖ్యానించారు. మంచి పనులు చేస్తే తనకు శత్రువులు పెరిగారని కూడా ఆయన అవేదన వ్యక్తం చేశారు. అంటే జగన్ తాను ఎందుకు అభివృధ్ధి పనులు కొన్ని చేయలేకపోయాను అని చెప్పుకునేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. తాను ఎంతో చేద్దామనుకుంటే చంద్రబాబే అడ్డం పడుతున్నాడని జగన్ వాపోతున్నారు. ఈ విషయాలనే ఆయన రేపటి రోజున జనంలోకి వెళ్ళి చెప్పడానికి రెడీ అవుతున్నారు.ఏపీలో అభివృధ్ధి అన్నది లేదని అనగలిగే సాహసం చంద్రబాబుకు ఉందా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే జగన్ చేసే ప్రతీ పనినీ అడ్డం పడుతున్న ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ మీద ఇప్పటికే వైసీపీ వ్యతిరేక ప్రచారం చేపట్టింది. సరే చంద్రబాబు జగన్ ని చేతకాని సీఎం అని జనంలోకి వెళ్ళి చెప్పాలనుకున్నా మీ వల్లే కదా ఆయన ఏమీ చేయలేకపోయిందన్న ప్రశ్న ఎదురైతే బాబుకు జవాబు ఉండదుగా. మరో వైపు కోర్టు కేసులు కానీ విపక్షం విమర్శలు కానీ ఇవన్నీ కూడా సానుకూలం చేసుకుని జగన్ 2024 నాటికి ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటున్నారు. చంద్రబాబు మాత్రం వద్దు అనే అంటున్నారు తప్ప ఏది కావాలో చెప్పడంలేదు. ఇదే తీరున ఉంటే తమ మేలు కొరకు కార్యక్రమాలు డిజైన్ చేసిన జగనే మళ్ళీ రావాలని జనం కోరుకున్నా ఆశ్చర్యం లేదుగా. ఏది ఏమైనా బాబు పాలిటిక్స్ ని అభివృధ్ధి నిరోధకమని జనాలకు పెద్ద గొంతు వేసుకుని వైసీపీ చెబుతోందిపుడు.

Related Posts