YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మరో 4 రోజుల వానలు

మరో 4 రోజుల వానలు

మరో 4 రోజుల వానలు
విశాఖపట్టణం, 
రాయలసీమ, కర్ణాటక, కేరళ, తమిళనాడు సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ 
హెచ్చరించింది. పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపింది.దేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని 
వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల పిడగులు పడే ప్రమాదం 
ఉందని హెచ్చరించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో అనూహ్య వరదలకు ఆస్కారం ఉందని తెలిపింది.రాయలసీమ, దక్షిణ కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో నుంచి మూడు, 
నాలులు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం, బుధవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం 
ఉందని హెచ్చరించింది.పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అసోం, మేఘాలయా, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో నేడు, రేపు విస్తృతంగా వర్షాలు కురిసే 
అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిబ్బందిని, ప్రజలను అప్రమత్తం చేశాయి.నైరుతి రుతు పవనాల 
ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు 
పొంగిపొర్లుతున్నాయి. పలు రాష్ట్రాల్లో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి

Related Posts