YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

శుభాలనిచ్చే ఆధ్యాత్మికపు ఆచారాలు

శుభాలనిచ్చే ఆధ్యాత్మికపు ఆచారాలు

గుంజీలు -- ఆలయాలలో వినాయకుని ముందు  గుంజీలు తీసి దండాలు పెట్టేవారిని చూస్తూంటాము.   ఇలా చేయడంలో విజ్ఞాన రీతిగా ఎన్నో మంచి ఫలితాలు వున్నవి.  రెండు చెవులను సాగదీసి  నొక్కడం వలన చెవుల  నరాలు  ప్రకంపిస్తాయి.  దీని వలన మెదడుకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. బుధ్ధి పెరుగుతుంది. శ్రధ్ధపెట్టి సరిగా చదవని
విద్యార్థులచెవులనుగురువులుమెలిపెట్టడానికారణం యిదే.
వేడినీళ్ళ అభిషేకాలు ---
108 వైష్ణవదేశాలలో ప్రధమ ఆలయమైన శ్రీ రంగంలో  శయనించే  భంగిమలో వున్న
రంగనాధునికి , అమావాస్య ఏకాదశి, మాసారంభమున ఆ రోజులలో  ఆ స్వామికి
వేడినీటి అభిషేకం జరుగుతుంది.ఈ సంప్రదాయం ఇతర ఆలయాలలో లేదు.
తెలుసుకుందాము----
స్టీలు కుందులలో  దేవుని వద్ద దీపాలు వెలిగించరాదు.  దీపాలలో దుర్గా, లక్ష్మీ, సరస్వతీ ఆనే మూడు శక్తులు వున్నాయి.  కంచు కుందులలో దీపం వెలిగిస్తే , పాపాలు
తొలగి పోతాయి. మట్టి ప్రమిదలో వెలిగిస్తే
శక్తి లభిస్తుంది.  రాగి ప్రమిదలలో వెలిగిస్తే కోపం, ఆవేశం తొలగిపోతుంది.నెయ్యి, నువ్వుల నూనె,  విప్పపువ్వు నూనె , కొబ్బరినూనె, ఆముదం మొదలైన ఐదు రకాలనూనెలతో దీపం వెలిగించి అమ్మవారి పూజచేస్తే, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
అరచేతిలో దైవాలు---
అరచేతుల చివర మహాలక్ష్మి మధ్యలో సరస్వతి , ఆరంభంలో గోవిందుడు వుంటారని ఐహీకం.
అందువలననే మనము ఉదయం లేవగానే అరచేతులను దర్శించుకుంటాము.
దేవతలని ప్రదక్షిణం చేసే  విధానాలు---
వినాయకునికి ఒక ప్రదక్షిణం
చేయాలి. పరమశివునికి, అమ్మవారికి
మూడు ప్రదక్షిణలు చేయాలి.అశ్వధ్ధ వృక్షానికి ఏడు సార్లు  ప్రదక్షిణం చేయాలి.
మహాత్ముల సమాధుల దగ్గర  నాలుగు సార్లు ప్రదక్షిణం చేయాలి.
నవగ్రహాలకి తొమ్మిది సార్లు ప్రదక్షిణలు జరపాలి. సూర్యునికి రెండుసార్లు ప్రదక్షిణలు చేయాలి. దోషాలు తొలగి శుభాలు చేకూరడానికి శ్రీ మహావిష్ణువు కి  లక్ష్మీదేవికి నాలుగు ప్రదక్షిణలు చేయాలి. ఆలయంలోని బలి పీఠానికి ధ్వజస్ధంభానికి ముందునే సాష్టాంగ నమస్కారం చేయాలి.
భగవద్గీత ఉపదేశించిన రోజు---
మహాభారత యుధ్ధంలో  అర్జునునికి కృష్ణ పరమాత్మ భగవద్గీత ఉపదేశించిన రోజు  వైకుంఠ ఏకాదశి. ఇలాగే పాలకడలిలో మంధర
పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకి అనే సర్పాన్ని త్రాడుగా చేసుకొని చిలకగా అమృతం
వెలువడిన రోజు వైకుంఠ ఏకాదశి.
ఆంజనేయునికి తమలపాకులమాల-----
శ్రీ రాముని విజయాన్ని, అశోకవనంలో రావణునిచే చెర బెట్టబడిన సీతాదేవికి
మొట్టమొదటగా  వార్త తెలియచేయడానికి హనుమవెళ్ళాడు. ఈ సంతోష విషయం తెలిపిన ఆంజనేయునికి  తను ఏదైనా
కానుక యివ్వాలని సీతాదేవి అనుకొన్నది.
కానుకగా యివ్వడానికి ఆ సమయంలో తన  వద్ద విలువైనదేదీ లేనందున,  ప్రక్కనున్న చూడగా తమలపాకుల  తీగ నుండి కొన్ని ఆకులు కోసి  మాలగా కట్టి హనుమ చేతికి యిచ్చింది.  యీ కారణంగానే భక్తులు హనుమంతునికి తమలపాకుల మాలలు సమర్పిస్తారు.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts