YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నూతన రథ నిర్మాణానికి ఏర్పాట్లు - మంత్రి చెల్లు బోయిన వేణు

నూతన రథ నిర్మాణానికి ఏర్పాట్లు - మంత్రి చెల్లు బోయిన వేణు

అంతర్వేది సెప్టెంబర్ 13,
ఇటీవల సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి రథం అగ్నికి ఆహుతి కావడం తో వచ్చే ఫిబ్రవరి స్వామి వారి కళ్యాణ సమయానికి నూతన రథాన్ని సిద్దం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర బిసి వెల్ఫేర్ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ణ అన్నారు.నూతన రథం నిర్మాణానికి సంబంధించి అవసరమైన కర్ర ను సేకరించేందుకు గాను శనివారం మంత్రి వేణు గోపాలకృష్ణ కొత్త పేట శాసన సభ్యులు చిర్ల జగ్గి రెడ్డి, మరియు దేవాదాయ శాఖ అధికారులు తో కలిసి రావులపాలెం అడితి మార్కెట్ కు వచ్చి రథానికి కర్రను ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రథం దగ్ధమైన సంఘటనపై లోతైన దర్యాప్తుకు  ముఖ్య మంత్రి సి.బి.ఐ సంస్థ చేత దర్యాప్తు చేయిస్తున్నారని,ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని మంత్రి అన్నారు.దైవ కార్యానికి సంభందించిన విషయంలో మత విద్వేషాలు,కుల విద్వేషాలు రెచ్చగొట్టడం భావ్యం కాదని,ప్రజల మనో రథం అనే మాటను వినియోగిస్తున్నారని ప్రజల మనోరధంలో ముఖ్య మంత్రి చిత్తశుద్ది వుందని, దీనిని కాపాడేందుకే ఘటన జరిగిన వారం లోపే నూతన రథ నిర్మాణానికి చర్యలు చేపట్టామని, యుద్ధ ప్రాతిపదికన నూతన రథ నిర్మాణం పూర్తి అవుతుందని మంత్రి తెలియచేశారు.రాష్ట్రంలో సుమారు 80 రథాలు నిర్మాణం చేసిన అనుభవం కలిగిన గణపతి ఆచార్యులు వారికి ఈ రథం నిర్మాణ భాద్యతలు అప్పగించామని, అలాగే టింబర్ డిపో యాజమాన్యం తో కూడా మాట్లాడి లాభాపేక్ష లేకుండా వారికి పడిన ధర కే కలపను సరఫరా చేసేందుకు వారు కూడా అంగీకరించారని మంత్రి తెలిపారు. మంత్రి వెంట కొత్త పేట శాసన సభ్యులు చిర్ల జగ్గిరెడ్డి,దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Related Posts