YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఉప ఎన్నికల్లో మూడు పార్టీల హోరాహోరి

ఉప ఎన్నికల్లో మూడు పార్టీల హోరాహోరి

బెంగళూరు  అక్టోబ‌రు 24, 
కర్ణాటకలో జరిగే రెండు నియోజకవర్గాల ఉపఎన్నికలు ప్రధాన పార్టీలకు కీలకంగా మారాయి. రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు కర్ణాటక బైపోల్స్ నవంబర్ 3 న జరుగుతుంది.ఈ రెండు నియోజక వర్గాలు బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ ఆర్ఆర్ నగర్, తుమ్కూర్ లోని సిరా.ఈ రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుగు కోసం ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి.జెడిఎస్ ఎమ్మెల్యే బి సత్యనారాయణ మరణం కారణంగా సిరా నియోజ కవర్గ ఎన్నిక అనివార్యమైది.ఈ క్రమంలో ఉప ఎన్నికలకు ముందు, ఆర్ఆర్ నగర్,  సిరా అసెంబ్లీ విభాగాలలో స్థానిక జెడిఎస్ నాయకులను కాంగ్రెస్ ఆకర్షిస్తోంది. ఈ నియోజకవర్గాలకు చెందిన 450 మందికి పైగా జెడిఎస్ నాయకులు గత వారంలో కాంగ్రెస్లో చేరారు. పాలక బిజెపి, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్,మూడవ పార్టీ జెడిఎస్ ఎన్నికలు పోటీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు చావో రేవోగా నిలిచాయి. ఈ పోటీ వాస్తవానికి ముఖ్యమంత్రి బిఎస్ యెడియరప్ప, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ మరియు జెడిఎస్ చీఫ్ కుమారస్వామిల మధ్య ఉందని చెప్పాలి.రెండు సీట్లు పాత మైసూర్ ప్రాంతంలో ఉన్నాయి.ఒకే కులానికి చెందిన డికె శివకుమార్కు రెండు సీట్లు గెలవడం తప్పనిసరి. అంతేకాకుండా, ఆరు నెలల క్రితం కెపిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇది అతని మొదటి ఎన్నిక కావటంతో కాంగ్రెస్ చీఫ్ శివకుమార్ ప్రతిష్టా త్మకంగా తీసుకున్నారు.సిరా నుంచి మాజీ మంత్రి, టిబి జయచంద్ర అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న జయచంద్ర గత అసెంబ్లీ ఎన్నికల్లో జెడిఎస్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు.అయితే ఈ సారి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం అధికంగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

Related Posts