YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దుబ్బాకలో పోటీ

దుబ్బాకలో పోటీ

దుబ్బాక అక్టోబ‌రు 24, 

దుబ్బాకలో పోటీ కాలిపోయే మోటార్లు... బాయికాడ మీటర్లు, ఉచిత కరెంట్ ల మధ్యే... 75 ఏళ్ల  కాంగ్రెస్, బీజేపీ ల పాలనలో లేని అభివృద్ధి ఐదేళ్ల తెరాస పాలనలో.... దుబ్బాక ఓటర్ ఎటు వైపు... ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు.
దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం గోవిందా పూర్ మధిర గ్రామం పొసాన్ పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గోన్నారు.   ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు  మాట్లాడుతూ  దుబ్బాక ఉప ఎన్నికల్లో ..కాలి పోయే మోటార్లు.... బాయి కాడా మీటర్లు... ఉచిత కరెంటు ల మధ్య పోటీ. - కాలి పోయే మోటార్లు అంటే కాంగ్రెస్.. బాయి కాడ మీటర్లు అంటే బిజెపి... ఉచిత కరెంట్ ..కడుపు నిండా సంక్షేమం అంటే టి ఆర్ ఎస్ పార్టీ అని వివరించారు.  బతుకమ్మ పండుగ అయిన ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అక్క చెల్లెల అభిమానం చూస్తే చాలా ఆనందంగా ఉంది.  70 ఏళ్ల కాంగ్రెస్ ,బిజెపి పరిపాలన లో లేని అభివృద్ధి ... 5ఏళ్ల టి ఆర్ ఎస్ పాలన లో విప్లవాత్మక మార్పులు తెచ్చాము. - ఈ అయిదు ఏండ్లలో ఇంటింటి కి నల్ల ద్వారా త్రాగు నీరు ఇచ్చారు సీఎం  కేసీఆర్ అని అన్నారు.  గతం లో మంచి నీరు కోసం ట్యాంకర్ల వెనకాల బిందెలతో మహిళల కోట్లా ట ఉండేది.  అప్పుడు ఎండాకాలం బోర్లు వేస్తే దుబ్బ వచ్చేది సుక్క నీరు రాకపోయెది. - ఇప్పుడు కేసీఆర్ ,రామలింగన్న నాయకత్వం లో మంచి నీటి బాధ లేదు.  పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్నాం...మీ గ్రామం లో 18 మందికి ఇచ్చాము.  కాన్పుకి పోతే సకల సౌకర్యాలతో తల్లికి,బిడ్డకి, తిండి,చక్కటి వైద్యం ,కేసీఆర్ కిట్,12000 రూ, ఇచ్చి ఇంటివద్ద దింపుతున్నామని అన్నారు.   24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం.  నాడు దుబ్బాకలో కాలిపోయిన మోటార్లు ,పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్స్ లు బాయిలకాడ మీటర్లు,  దుబ్బాకలో   కాలిపోయిన మోటర్లు ,బాయిల కాడ మీటర్లు , ఉచిత కరెంటు మధ్యన పోటీ.. మీరు ఏ వైపని ప్రశ్నించారు.  బీడీ పెన్షన్లు ఇస్తున్నాం బిజెపి వాళ్ళు ఇస్తారా ?   బిజెపి వాళ్ళు 1600 ఇస్తున్నామని అబద్ధాలు చెపుతున్నారు.  వాళ్ళు పరిపాలించే రాష్టలలో ఎందుకు ఇవ్వట్లేదు ? అని అడుగుతే   ప్రశ్నిస్తే సమాధానం లేదు .  కాంగ్రెస్ ప్రభుత్వ హయం లో కరెంటు  ఉండేదా ? దొంగ రాత్రి కరెంటు ఎంతో ఇబ్బంది పడ్డాం.  24 గం,, నాణ్యమైన కరెంటు ఉచితంగా ఇస్తున్నాం.  మేము ఎన్నో ట్రాన్స్ ఫార్మర్లు ఇచ్చాం.  కాంగ్రెస్ హయం లో మోటార్ కాలిపోతే 10వెేలు.. ట్రాన్స్ఫార్మర్స్ పేలిపోతే 30000 రూ కట్టాల్సిన పరిస్థితి.  పోసాన్ పల్లి నిజాయితీ , నిబద్దత గల గ్రామం..ఈ గ్రామాన్ని ఆదర్శంగా చేసుకుందాం..  మన అభివృద్ధి జరగాలి అంటే టి ఆర్ ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యం అవుతుంది.   ఓట్లు అప్పుడే వచ్చే వాళ్ళు కాంగ్రెస్ , బిజేపీ నాయకులు.. కానీ మీ కష్టసుఖాల్లో ఉండేది మేము..టి ఆర్ ఎస్ పార్టీ అని మంత్రి అన్నారు.

Related Posts