YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గ‌వ‌ర్న‌ర్ ఎందుకు కామ్ గా మారిపోయారు...

గ‌వ‌ర్న‌ర్ ఎందుకు కామ్ గా మారిపోయారు...

విజ‌య‌వాడ‌, అక్టోబ‌రు 26, 
గ‌తంలో అయితే.. రాజ‌కీయాల‌పై మాత్రమే విమ‌ర్శలు చేసే ఓ వ‌ర్గం ప్రజ‌లు ఇప్పుడు త‌ప్పులు ఎక్కడ జ‌రుగుతున్నా.. వేలెత్తి చూపిస్తున్నారు. అది రాజ్యాంగ బ‌ద్ధమైన ప‌ద‌వైనా.. ప్రజాస్వామ్య యుతంగా అందిపుచ్చుకున్నప‌ద‌వి అయినా.. త‌ప్పులు.. లోపాలు ఉన్నప్పుడు మొహ‌మాటం లేకుండా చెబుతున్నారు. తాజాగా ఏపీ విష‌యంలోనూ ఇలాంటి వ్యవ‌హార‌మే ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. రాజ్యాంగ బ‌ద్ధమైన ప‌ద‌విలో ఉన్న గ‌వ‌ర్నర్ పై ఇప్పుడు.. సోష‌ల్ మీడియాలో విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఆయ‌న జ‌గ‌న్ మ‌నిషా ?! అనే ప్రశ్నలతో సోష‌ల్ మీడియాలో వ్యాఖ్యలు క‌నిపిస్తున్నాయి.నిజానికి ఎవ‌రిపైనైనా విమ‌ర్శలు చేసే.. నాయ‌కులు.. ఓ వ‌ర్గం మేధావులు స‌హ‌జంగా ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ.. రాజ్యాంగ బ‌ద్ధమైన ప‌ద‌వుల్లో ఉన్నవారిపై మాత్రం ఆచి తూచి వ్యవ‌హ‌రించేవారు. కానీ, ఇప్పుడు మాత్రం ప‌రిస్థితి మారింది. అటు నాయ‌కులు.. ఇటు మేధావులు.. ప్రజ‌లు కూడా అంద‌రిపైనా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ గ‌వ‌ర్నర్‌పైనా విమ‌ర్శల గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాల‌న అంతా కూడా గ‌వ‌ర్నర్‌ పేరుతోనే సాగుతుంది. సాంకేతికంగా ఆయ‌నే కీల‌కం. పైకి.. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వం ఉన్నప్ప‌టికీ.. అంతిమంగా గ‌వ‌ర్నర్ సంత‌కం, అనుమ‌తి లేనిదే ఏదీ సాధ్యం కాదు. ఏదైనావివాదం అవుతుంటే.. ఆపేసే అవ‌కాశం కూడా గ‌వ‌ర్నర్‌కు ఉంటుంది.ఇక‌, సీఎం కానీ, ప్రభుత్వం కానీ.. వివాదాస్పద నిర్ణ‌యాలు తీసుకున్నా.. హ‌ద్దులు దాటుతోంద‌ని భావించినా.. నేరుగా త‌న వ‌ద్దకు పిలిపించుకుని హెచ్చరించి గాడిలో పెట్టే అధికారం.. రాజ్యాంగ బ‌ద్ధంగానే గ‌వ‌ర్నర్‌కు సంక్రమించింది. ఏపీ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. సీఎం జ‌గ‌న్ వ్యవ‌హారంతో రాష్ట్రం ప‌రువు న‌డివీధిలో ప‌డింద‌నే భావ‌న ఉంది. అమ‌రావతి రాజ‌ధాని మార్పు, తెలుగు మాధ్యమం ఎత్తివేత‌, ఎస్సీల‌పై దాడులు, ప్రతిప‌క్షాల‌ను లేకుండా చేయాల‌నే వ్యూహం.. ఇప్పుడు ఏకంగా న్యాయ‌వ్యవ‌స్థనే టార్గెట్ చేయ‌డం.. సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం వంటివి సీఎం త‌న ల‌క్ష్మణ రేఖ‌ను దాటేశార‌న‌డానికి ప్రబ‌ల నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తున్నాయ‌ని దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రధాన విమ‌ర్శ.మ‌రి ఇంత జ‌రుగుతున్నా.. గ‌వ‌ర్నర్ ఏం చేస్తున్నట్టు ? సీఎంను పిలిచి మాట్లాడారా ? సుప్రీం కోర్టు సీజేకు సీఎం లేఖ రాయ‌డం అంటే.. అస‌లు గ‌వ‌ర్నర్‌కు తెలిసే జ‌రిగిందా ? లేక‌.. తెర‌చాటు ఏం జ‌రుగుతోంది. ఇవీ.. ఇప్పుడు సోష‌ల్ మీడియా సంధిస్తున్న ప్రశ్నలు. ఈ నేప‌ధ్యంలో రాజ‌కీయ నేత‌లు గ‌వ‌ర్నర్ జ‌గ‌న్ మనిషేమో!! అనే సందేహాలు కొంద‌రు వ్యక్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిని ఎవ‌రు స‌మాధానం చెబుతారు? చూడాలి..!

Related Posts