YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సిద్దిపేట సీపీపై చర్యలు తీసుకోవాలి - బండి సంజయ్

సిద్దిపేట సీపీపై చర్యలు తీసుకోవాలి - బండి సంజయ్

కరీంనగర్ అక్టోబ‌రు 27, 
సోమవారం సిద్దిపేట లో పోలీసులు తనపై చేసిన దాడికి నిరసనగా  రాత్రి నుంచి ఎంపీ బండి సంజయ్ రాత్రి  నుంచి దీక్ష చేస్తున్నారు. ఈ సందర్బంగా అయన తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్ధిపేట సీపీ జోయల్ డేవిస్ పై చర్యలు తీసుకోవాలన్నారు. దుబ్బాక నియోజక వర్గం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కేటాయించిన  నిధుల విషయంలో  సీఎం కేసీఆర్ స్వయంగా దుబ్బాక బస్టాండ్ చౌరస్తా లో బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.  దుబ్బాక నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల  తమ పోలింగ్ బూత్ పరిధిలో ప్రచార కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బయట జరిగే విషయాలను పట్టించుకోకుండా ఎక్కడి వారు అక్కడే ప్రచారంలో పాల్గొంటూ టీఆరెస్ పార్టీ అక్రమంగా గెలిచే ప్రయత్నాలను  అడ్డుకోవాలన్నారు. .దుబ్బాకలో బీజేపీ గెలవబోతుందన్నారు. దుబ్బాకలో గెలుపు బీజేపీ దే అన్నారు. సర్వేలన్ని  బీజేపీ గెలబోతుందని చెప్తున్నాయన్నారు. వున కార్యకర్తలు జాగ్రత్తగా వుండి  టీఆరెస్ పార్టీ అక్రమంగా గెలవడానికి చేసే ప్రయత్నాలు అడ్డుకోవాలన్నారు. బీజేపీ గెలుపు ఖాయమని తెలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్ దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు ఇళ్లల్లోకి పోలీసుల చేత అక్రమంగా దాడులు చే యిస్తున్నారన్నారు. పోలీసులు ప్రగతి భవన్, కేసీఆర్ ఫామ్ హౌస్ లలో తనిఖీలు ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నించారు.. అక్కడ బోలెడు డబ్బులున్నాయని అక్కడ కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించాలి అని డిమాండ్ చేసారు. ప్రగతి భవన్ కు పామ్ హౌజ్ లకు తానే స్వయంగా ముట్టడిస్తానని హెచ్చరించారు. తమ పట్ల కొన్ని మీడియా సంస్థలు కూడా ఉద్దేశ పూర్వకంగా తప్పుడు వార్తలు ప్రసారం చేసిస్తున్నాయన్నారు.. కొన్ని పత్రికలు అమ్ముడుపోయి బీజేపీ వార్తలకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అరోపించారు. వాస్తవాలను వక్రీకరించి రాయడం మానుకోక పోతే బీజేపీ మీడియా వైఖరిని ప్రతిఘటిస్తామన్నారు.

Related Posts