YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాసర ఆలయంలో అవకతవకలు.. కన్నెర్ర జేసిన గ్రామస్తులు

బాసర ఆలయంలో అవకతవకలు..  కన్నెర్ర జేసిన గ్రామస్తులు

నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి సన్నిధిలో గత మూడు నెలల క్రితం అమ్మవారి ఆలయంలో అవినీతి రాజ్యమేలుతుందని కొన్ని వార్త పత్రికలు ప్రముఖ చానళ్ళలో వక్చిన కథనాలకు దేవాదాయశాఖగతంలోనే స్సందించింది. ముగ్గురు అధికారుల తో కూడిన  త్రిసభ్య   కమిటీ ని బాసర ఆలయంలో విచారణ కు నియమించి పూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశాలు కుడా జారీ చేసింది. తాజాగా రెండు రోజుల క్రితం త్రిసభ్య కమిటీ ఆధ్వర్యం లో గత మూడు సంవత్సరాల నుండి బాసర ఆలయంలో సుమారు వంద కోట్ల అవినీతి జరిగిందని ఆధారాల తో సహా బయట పెట్టింది. కింది స్థాయి అధికారి నుండి పై స్థాయి అధికారి వరకు ఈ వంద కోట్ల కుంభకోణం లో హస్తo ఉందని ఆరోపిస్తూ బుధవారం ఉదయం బాసర గ్రామస్తులు గ్రామ వీధుల్లో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి ఆలయo లో అమ్మవారికి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం ఆలయ ప్రత్యేకఅధికారి సుధాకర్ రెడ్డి కి కూడ వినతి పత్రం అందించారు...దక్షిణ భారత దేశంలోనే ఏకైక ప్రసిద్ధ పుణ్య క్షేత్రం చదువుల తల్లి సరస్వతీ అమ్మవారు తెలంగాణ లో ని బాసర క్షేత్రం లో ఉన్నారని అమ్మవారి ఆలయ ప్రతిష్ట కు భంగం కలిగించే విధంగా స్థానిక నాయకులు ఆలయాధికారులు కుమ్మక్కైయరని ఆరోపించారు.  కోట్ల రూపాయల్లో అవినీతి జరిగినా నేటి వరకు జిల్లా కు చెందిన  దేవాదాయశాఖ మంత్రి చర్యలు తీసుకోక పోవడం విడ్డూరమన్నారు..అవినీతి అధికారులను బాసర నుండి బదిలీ చేయడం తో పాటు వాళ్ళ పై క్రిమినల్ కేసులను పెట్టి జైలుకు పంపాలని డిమాండ్ చేసారు. బాసర ఆలయం పై ముఖ్య మంత్రి కి ఉన్న చిత్త శుద్ది ని నిరూపించుకోవాలని లేని పక్షంలో ఆమరణ నిరాహారదీక్ష కైనా సిద్దమని ప్రగతి భవన్ ముట్టడికి కూడ వెనుకాడమనీ స్పష్టం చేసారు

Related Posts