YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

దేశం కోసం ప్రాణాలర్పించిన వీరనారి ఇందిరాగాంధి

దేశం కోసం ప్రాణాలర్పించిన వీరనారి ఇందిరాగాంధి

దేశం కోసం ప్రాణాలర్పించిన వీరనారి ఇందిరాగాంధి
జగిత్యాల   అక్టోబర్ 31
దేశం కోసం ప్రాణాలర్పించిన వీరనారీ భారత మాజీ ప్రధానమంత్రి  ఇందిరాగాంధీ  అని జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం అన్నారు. జగిత్యాలలో  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలను శనివారం ఘనంగా జరిపారు.   కాంగ్రెస్  నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటినుంచి ర్యాలీగా బయలుదేరి  పాత బస్టాండ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు చేరుకొని  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈసందర్బంగా నాగభూషణం మాట్లాడుతూ   ఇందిరా గాంధీ   దేశంలో  పెదాలు ఉండకూడదనే  ఉద్దేశంతో   గరీబీ హటావో నినాదం చేపట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం  అన్నింటిని  ప్రయివేటీకరణ చేస్తున్నాయని దుయ్యబట్టారు.  29సూత్రాల కార్యక్రమం,  బ్యాంకుల జాతీయీకరణ,  రాజభరణాల రద్దు, సాగునీటిరంగాన్ని  ప్రోత్సహించడానికి ఎస్సారెస్పీ  ప్రాజెక్ట్  నిర్మాణం చేపట్టి రైతుల హృదయాల్లో  నిలిచిపోయిన  మహనీయురాలు  ఇందిరాగాంధీ అని కొనియాడారు. రాబోయే రోజుల్లో దేశం,  రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ  జెండా ఎగురవేయడానికి కార్యాకర్తలు కృషి చేయాలనీ నాగభూషణం పిలుపునిచ్చారు.
 జగిత్యాల  మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కల్లపెల్లి దుర్గయ్య మాట్లాడుతూ  దేశ సమగ్రత,  సమైక్యత కోసం ఇందిరాగాంధీ పాటుపడ్డారన్నారు. దేశ అభివృద్దే ధ్యేయంగా ఇందిరాగాంధీ  పనిచేసి   ప్రపంచంలో   శాశ్వతంగా  పేరు నిలిచేలా కృషిచేశారని  తెలిపారు. పేదలకోసం  కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని దుర్గయ్య అన్నారు. కార్యక్రమంలో  మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మన్సూర్ అలీ, కౌన్సిలర్  నక్క జీవన్, కాంగ్రెస్  నాయకులు తాటిపర్తి దేవేందర్ రెడ్డి,  బండ భాస్కర్ రెడ్డి, గాజుల రాజేందర్, మాజీ సర్పంచ్  రమేష్,    బింగి రవి  పుప్పాల అశోక్,  అల్లాల రమేష్ రావు,  కట్ట శివకుమార్,  బాపురెడ్డి,  మహిపాల్,వెంకటేష్  తదితరులు పాల్గొన్నారు.

Related Posts