YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రైతులకు ప్రపంచంలోనే తొలివేదిక

రైతులకు ప్రపంచంలోనే తొలివేదిక

రైతులకు ప్రపంచంలోనే తొలివేదిక

వరంగల్, అక్టోబరు 31
ప్రపంచ దేశాల్లో ఎక్కడా రైతులకు ఒక వేదిక అంటూ లేదని, తెలంగాణాలోనే తొలిసారి రైతుల కోసం భవనాలను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. రైతు పెద్దవాడే కానీ కూర్చొని
మాట్లాడుకునేందుకు స్థలమే లేదని అభిప్రాయపడ్డారు. అందుకే రైతు వేదికలను ఏర్పాటు చేసుకున్నట్లు వివరించారు. తెలంగాణలో తొలి రైతు వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం జనగాం జిల్లా
కొడకండ్లలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఉద్యమ సమయంలో రైతుల బాధలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని సీఎం ఆవేదన చెందారు. తెలంగాణ రైతులను
దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని, రైతు వేదిక ఏర్పాటు వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయం అని కేసీఆర్ అన్నారు.ఇతర దేశాల్లో మాదిరి మన దేశంలో రైతులకు సబ్సిడీ ఇద్దామంటే కేంద్రం
ఆక్షలు అడ్డుపతున్నాయని సీఎం విమర్శించారు. ఇండియాలో ఏ రాష్ర్ట ప్ర‌భుత్వం కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయ‌డం లేదు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక ప్ర‌భుత్వం తెలంగాణ
మాత్ర‌మే అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. జ‌న‌గామ జిల్లాలోని కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేసీఆర్ ప్ర‌సంగించారు. ధాన్యానికి మంచి
ధ‌ర ఇద్దామంటే మెడ మీద క‌త్తి పెడుతున్నారు. ఈ ర‌క‌మైన చిక్కుల్లో మ‌నం ఉన్నాం. రైతుల బాధ‌లు, ఆత్మ‌హ‌త్య‌లను క‌ళ్లారా చూశాను. వాటిని చూసి బాధ‌ప‌డ్డాను. సీఎం అయిన త‌ర్వాత క‌ఠిన
నిర్ణ‌యాలు తీసుకున్నా. తెలంగాణ రైతాంగం భార‌త‌దేశంలోనే అగ్ర‌గామిగా ఉండాల‌ని ప్ర‌తిజ్ఞ తీసుకున్నాం. ఇది టెక్నాల‌జీ యుగం. అంద‌రి వ‌ద్ద స్మార్ట్ ఫోన్లు, ఇంట‌ర్నెట్ ఉంది. దీంతో ప్ర‌జ‌లంద‌రూ
వాస్త‌వాలు తెలుసుకోవాలి. రైతులు చ‌ర్చ చేయాలి. క‌రోనా మ‌హ‌మ్మారి పీడ ఇంకా ఉంది. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. సెకండ్ వేవ్ క‌రోనా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఈ
క్ర‌మంలో రైతుల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామ‌న్నారు. తెలంగాణ రైతు లోకానికి దండం పెట్టి చెబుతున్నాను. ఈ వేదిక‌లో ప్ర‌పంచంలో, దేశంలో
ఎక్క‌డా లేవు. క‌డ‌కొండ్ల‌లో రైతు వేదిక ప్రారంభించ‌డం సంతోషంగా ఉంది. రాజ్యం గెలిచినంతా సంతోష‌మైంది. కేబినెట్ స‌మావేశాల్లో చ‌ర్చ‌లు జ‌రిపి.. రైతు వేదిక‌లు నిర్మించాల‌ని సంక‌ల్పించాం. ఎన్ని
వంద‌ల కోట్లు అయినా స‌రే ఖ‌ర్చు పెట్టి రైతు వేదిక‌ల‌ను నిర్మాణం చేశాం. రాష్ర్ట వ్యాప్తంగా 2601 రైతు వేదిక‌లు నిర్మిస్తున్నాం. మ‌రో వారం రోజుల్లో అన్ని వేదిక‌లు పూర్త‌వుతాయి. దాదాపుగా 600
కోట్లు ఖ‌ర్చు పెట్టామ‌న్నారు. గొప్ప ఉద్దేశంతో, అవ‌గాహ‌న‌తో ఈ వేదిక‌ల‌ను నిర్మించామ‌న్నారు. . కేంద్ర ప్రభుత్వంపై రైతులు పిడికిలి పట్టి ఉద్యమించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచే
ఉద్యమం ప్రారంభం కావాలని అన్నారు.రైతు వేదిక ఒక ఆటంబాంబు అని, అక్కడే పంట ధరలు నిర్ణయించాలని కేసీఆర్ అన్నారు. రైతులను ప్రభుత్వం ఎందుకు నియత్రించాలని, ఎవడో ఎల్లయ్య
కాకుండా రైతు సంఘాల్లోనే పంట ధరలు కూడా నిర్ణయించాలన్నారు. రైతుల కోసమే రైతు వేదికలు నిర్మిస్తున్నామని, ఇందు కోసం రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.

Related Posts