YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

పదవులు ఇచ్చినా...అంతేనా

 పదవులు ఇచ్చినా...అంతేనా

మొన్నటి వరకూ పదవులు భర్తీ కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు పదవులు భర్తీ అయిన తర్వాత మాత్రం పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో నేతలందరినీ సమన్వయం చేయడం కష్టసాధ్యమే. అలాంటిది ఇప్పుడు చాలా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కొత్త నేతలు బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారిని పలకరించే నేతలు కూడా కరవయ్యారట. పార్లమెంటరీ ఇన్ ఛార్జులను లెక్క చేయని పరిస్థితి నెలకొంది.అధికారంలో లేదు కాబట్టి పార్లమెంటు ఇన్ ఛార్జులు సయితం నేతల పై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేకపోతున్నారు. అనేక పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో నేతల మధ్య సమన్వయం లేదు. అధికారంలో ఉన్నప్పుడు తలెత్తిన విభేదాలు నేటికీ కొనసాగుతున్నాయి. వాటిని పరిష్కరించి అందరినీ ఏకం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఇన్ ఛార్జులపై ఉన్నా వారి వల్ల సాధ్యమవుతుందా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును చంద్రబాబు ఇన్ ఛార్జిగా నియమించారు. ఈ పార్లమెంటు పరిధిలో ఏలూరు, దెందులూరు, చింతలపూడి, పోలవరం, ఉంగుటూరు, నూజివీడు, కైకలూరు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. ఈ పరిధిలోని అనేక నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం లేదు. చింతలపూడిలో పీతల సుజాత ఉన్నప్పటికీ ఆమెకు బాధ్యతలను అప్పగించలేదు.ఇక కైకలూరు, నూజివీడు శాసనసభ నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన నాయకత్వం లేదు. పైగా ఇక్కడ రెండు గ్రూపులు బలంగా ఉన్నాయి. ఇక ఏలూరు నియోజకవర్గానికి వస్తే మాగంటి బాబు కుటుంబం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. మాగంటి బాబుకు అనేకమంది నేతలకు పడటంలేదు. గన్ని వీరాంజనేయులు పేరును ప్రకటించిన తర్వాత ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన వారు కూడా కొంతమందే ఉన్నారు. మొత్తం మీద పదవుల పంపిణీ జరిగినా నేతల సమన్వయం వారికి పెద్ద తలనొప్పిగా

Related Posts